Top
logo

హాలీవుడ్ సినిమాతో పోటీ విరమించుకున్న యువ హీరో

హాలీవుడ్ సినిమాతో పోటీ విరమించుకున్న యువ హీరో
Highlights

కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ' ని తెలుగులో 'కిరాక్ పార్టీ' అనే టైటిల్ తో రీమేక్ చేసి ఫ్లాప్ అందుకున్న యువ హీరో...

కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ' ని తెలుగులో 'కిరాక్ పార్టీ' అనే టైటిల్ తో రీమేక్ చేసి ఫ్లాప్ అందుకున్న యువ హీరో నిఖిల్ ఈసారి తమిళ సినిమా 'కనితన్' రీమేక్ అయిన 'అర్జున్ సురవరం' తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. నిజానికి ఈ సినిమాకి ముందు 'ముద్ర' అనే టైటిల్ ను ఖరారు చేశారు కానీ తరువాత దీనిని 'అర్జున్ సురవరం' గా మార్చారు. ఈ సినిమా ట్రైలర్ రేపు విడుదల కావలసి ఉంది. అలాగే ఈ సినిమా మే 1న విడుదల అవుతుందని దర్శక నిర్మాతలు ఖరారు చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ను వాయిదా వేయడమే కాక సినిమాను విడుదలను కూడా వాయిదా వేశారు.

హాలీవుడ్ సినిమా 'ఎవెంజర్స్ అండ్ గేమ్' ఈ వారం 26న విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు సంవత్సర కాలంగా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టికెట్లు ఆన్లైన్ లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ వారాంతం వరకు మాత్రమే కాక వచ్చే వారం కూడా అవెంజర్స్ సినిమా థియేటర్లలో హంగామా చేయనుంది. అందుకే 'అర్జున్ సురవరం' సినిమాను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. టీఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ను జూన్ 4 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది.

Next Story