ఏప్రిల్ 7న బుల్లితెరలో మహానేత 'యాత్ర'

ఏప్రిల్ 7న బుల్లితెరలో మహానేత యాత్ర
x
Highlights

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి. తన రాజకీయ జీవితంలో భాగమైంది ఆయన పాదయాత్ర. ఈ పాదయాత్రలో...

తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి. తన రాజకీయ జీవితంలో భాగమైంది ఆయన పాదయాత్ర. ఈ పాదయాత్రలో ప్రజల కష్టాలను ఆ స్వయంగా చూశారు.. తెలుసుకున్నారు. ఈ పాదయాత్ర నుంచి పుట్టినవే.. ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ.. అప్పట్లో ఈ పాదయాత్ర ఒక గొప్ప పరిపాలనకు నాంది. ఈ పాదయాత్ర అంశాన్ని కథగా తీసుకుని తెరకెక్కిన చిత్రం 'యాత్ర' మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించారు. ఆశ్రీత వేమగంటి విజయమ్మ పాత్రను పోషించారు. రావు రమేష్ కెవిపి పాత్రలో నటించారు.

ఫిబ్ర‌వ‌రి 8, 2019న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దాదాపు 27 కోట్ల గ్రాస్ వసూలు చేసి 2019 లో విడుదలైన హిట్ చిత్రాల సరసన చేరింది. అయితే ఈ మూవీ ఏప్రిల్ 7న మాటీవీలో ప్ర‌సారం చేయ‌నున్న‌ట్టు ఆ ఛానెల్ తెలిపింది. ఏప్రిల్ 11న ఏపీలో ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గ‌నుండగా, నాలుగు రోజుల ముందు ఈ చిత్రాన్ని టెలికాస్ట్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories