Yash Toxic: వెనక్కి తగ్గిన 1400 కోట్ల హీరో.. యశ్‌కు ఇక తిరుగేలేదు!

Yash Toxic: వెనక్కి తగ్గిన 1400 కోట్ల హీరో.. యశ్‌కు ఇక తిరుగేలేదు!
x

Yash Toxic: వెనక్కి తగ్గిన 1400 కోట్ల హీరో.. యశ్‌కు ఇక తిరుగేలేదు!

Highlights

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా క్లాష్‌లలో 'టాక్సిక్' వర్సెస్ 'ధురంధర్ 2' ఒకటి.

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా క్లాష్‌లలో 'టాక్సిక్' వర్సెస్ 'ధురంధర్ 2' ఒకటి. ఈ పోటీపై తాజా అప్‌డేట్ ఒకటి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. టాక్సిక్, ధురంధర్ 2 చిత్రాలు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రాజెక్టులు కావడంతో.. ఈ క్లాష్‌పై సినీ పరిశ్రమలో జోరుగా చర్చలు సాగాయి. అయితే ధురంధర్ 2 రిలీజ్ డేట్ మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం టాక్సిక్. బ్లాక్‌బస్టర్ కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నుంచి సినిమా వస్తుండటంతో.. ఇప్పటికే టాక్సిక్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ మార్చి 19న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకుని తెరకెక్కుతున్నందున ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా హైప్ కనిపిస్తోంది. అదే రోజు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 విడుదల అవనుంది. దాంతో రెండు భారీ చిత్రాల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

ధురంధర్ ఊహించని రీతిలో ఘన విజయం సాధించింది. ఏకంగా రూ.1400 కోట్లు వసూల్ చేసింది. ఈ విజయంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. షూటింగ్ ఆలస్యం కారణంగా ధురంధర్ 2 విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే ‘టాక్సిక్’కు బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ ఉండదని చెప్పాలి. సోలో రిలీజ్ దక్కితే కలెక్షన్ల పరంగా భారీ రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రూ.1400 కోట్ల హీరో పోటీ నుంచి తప్పుకుంటే.. యశ్‌కు ఇక తిరుగుండదు. అయితే ‘ధురంధర్ 2’ విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories