సానుభూతి సమంత సినిమాకు వర్క్ అవుట్ అవుతుందా?

* ఇప్పటికే ఒక సారి విడుదల వాయిదా పడ్డ ఈ చిత్రం తాజాగా ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది

R Tripura Malini
Updated on: 4 Nov 2022 7:00 AM IST
Yashoda Movie Got Enough Publicity With Samanthas Recent Social Media Post
X

సానుభూతి సమంత సినిమాకి వర్క్ అవుట్ అవుతుందా? 

Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటించిన ఫిమేల్ సెంట్రిక్ సర్వైవల్ థ్రిల్లర్ "యశోద" సినిమా తెలుగు తో పాటు ఇతర భాషల్లో నవంబర్ 11న విడుదల కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఒక సారి విడుదల వాయిదా పడ్డ ఈ చిత్రం తాజాగా ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత పాల్గొనడం లేదు. ఆమె తీవ్ర అనారోగ్య పరిస్థితి దీనికి కారణం.

బెడ్ పై చేతికి సెలైన్ ఉండగా సమంత యశోద సినిమాకు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. కాబట్టి సమంత సినిమా ప్రమోషన్ల కు వచ్చే పరిస్థితి లేదు అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు అందరూ సమంత మరియు తన వ్యాధి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇలా యశోద సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ అయితే దొరికింది అని చెప్పాలి. "యశోద" సినిమా కు సమంత పబ్లిసిటీ చేయకపోయినా కూడా తన మీద సానుభూతి సినిమాకి కలిసి వస్తుందని తప్పకుండా సినిమా కు ప్రేక్షకుల నుండి స్పందన ఉంటుందనీ కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా కి కొంత పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఖచ్చితంగా భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కథ మొత్తం కూడా సరోగసి బ్యాక్ డ్రాప్ తో నడుస్తుంది. అంతేకాకుండా సరోగసీ పేరుతో చట్ట విరుద్దంగా సాగుతున్న అక్రమాల గురించి సినిమాలో చూపించబోతున్నారట. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. సినిమాలో సమంత గర్భవతి పాత్రలో కనిపించబోతుంది. నవంబర్ 11 న సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story