యశ్ ప్రశాంత్ నీల్ కోసం ఎదురు చూస్తాడా..? నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుంది..?

Yash Waiting for Prashanth Neel When is Yash Next Movie | Tollywood Gossips
x

యశ్ ప్రశాంత్ నీల్ కోసం ఎదురు చూస్తాడా..? నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుంది..?

Highlights

Yash: "కే జి ఎఫ్" సినిమా తో కన్నడ స్టార్ యశ్ ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు...

Yash: "కే జి ఎఫ్" సినిమా తో కన్నడ స్టార్ యశ్ ప్యాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు. "కేజిఎఫ్" మొదటి పార్ట్ బాక్సాఫీస్ వద్ద 2500 కోట్లు వసూలు చేయగా కేజిఎఫ్ 2 అంచనాలకు మించి ఏకంగా 12 వందల కోట్లను వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇక కన్నడ అభిమానులు మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా కే జి ఎఫ్ సినిమా తో యశ్ కి ఫాన్స్ అయిపోయిన అందరూ ఇప్పుడు యశ్ తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే "కే జి ఎఫ్: చాప్టర్ 2" క్లైమాక్స్ లో "కే జి ఎఫ్: 3" కూడా ఉండబోతోంది అని హింట్ వచ్చింది. కాబట్టి తదుపరి సినిమా అదే కావచ్చు అని కొంతమంది చెబుతున్నారు. కానీ చిత్ర డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో "సలార్" సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేయాల్సి ఉంది.

2024 కానీ సినిమా విడుదల అవదు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే ప్రశాంత్ నీల్ తో "కే జి ఎఫ్ 3" ప్లాన్ చేయగలరు. అంటే "కే జి ఎఫ్ 3" సినిమా సెట్స్ పైకి 2024లో వెళ్తే సినిమా 2025 లో విడుదలవుతుంది. మరి ప్రశాంత్ నీల్ కోసం యశ్ ఎదురు చూస్తాడా లేక ఈ గ్యాప్ లో మరొక సినిమాని పూర్తి చేస్తారా అని క్లారిటీ రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories