యశ్ వైఖరి తో నిరాశ చెందుతున్న అభిమానులు

Yash enjoying the simple joys of life in Europe
x

యశ్ వైఖరి తో నిరాశ చెందుతున్న అభిమానులు

Highlights

*యశ్ వైఖరి తో నిరాశ చెందుతున్న అభిమానులు

Yash Fans: కన్నడ స్టార్ హీరో యశ్ "కే జీ ఎఫ్" సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. "కే జి ఎఫ్ చాప్టర్ 1" తోనే రికార్డులు సృష్టించిన సృష్టించిన రాకింగ్ స్టార్ "కేజీఎఫ్: చాప్టర్ 2" తో రికార్డులను తిరగ రాశారు. అయితే "కేజీఎఫ్: చాప్టర్ 2" సినిమా విడుదలై చాలా రోజులు అయింది. కానీ ఇంకా యశ్ తన తదుపరి సినిమా గురించిన క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

"కే జి ఎఫ్: చాప్టర్ 2" సినిమా విడుదల తర్వాత నుంచి తన భార్య రాధిక పండిట్ మరియు పిల్లలతోనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ తన సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి ఫారిన్ వెకేషన్స్ కి కూడా వెళ్తున్నారు. ప్రస్తుతం యశ్ తన భార్య పిల్లలతో యూరప్ లో ఉన్నారు. "కే జీ ఎఫ్" కోసం నాలుగేళ్లు గ్యాప్ లేకుండా కష్టపడిన యశ్ ఈ సమయాన్ని కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే గడపడానికి ఇష్టపడుతున్నట్లు చెప్పవచ్చు.

సినిమా కోసం మరియు ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడ్డ యశ్ ఇప్పుడు యూరప్ లో రిలాక్స్ అవుతున్నారు. అయితే తన తదుపరి సినిమా గురించి కేవలం ఒక్క మాట చెప్పిన కూడా అభిమానులకు కొంచెం ఊరట కలుగుతుంది అని కొందరు చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు యశ్ తో ఒక పెద్ద ప్యాన్ ఇండియా సినిమా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక కొత్త కన్నడ డైరెక్టర్ కూడా యశ్ తో టాక్స్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని గురించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories