'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమా రివ్యూ

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమా రివ్యూ
x
Highlights

ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విడుదల అయ్యింది.

ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విడుదల అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు పూర్తయిపోయాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్లో, తెలుగు ఇప్పటికే చూసిన అభిమానులు తమ అభిమాన హీరో విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఎలా ఉంది అనే విషయంపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటించారు. రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లా విజయ్ దేవరకొండతో జతకట్టారు. ఈమధ్యే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేసింది. విజయ్ దేవరకొండ మార్క్ పూర్తిగా ఆ ట్రైలర్ లో కనిపించింది. ఈ సినిమా విడుదల కోసం నిర్వహించిన ప్రచారం కూడా విపరీతమైన హైప్ ను తీసుకొచ్చింది.

ఈ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొని ఉంది. అందులోనూ ఈ రోజు ప్రేమికుల రోజు సందర్భంగా వరల్డ్ ఫేమస్ లవర్ టైటిల్ తో విజయ్ దేవరకొండ రొమాంటిక్ గా వెండితెరను పలకరిస్తుండటంతో, ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా విజయ్ దేవరకొండ కు మరో సూపర్ హిట్ గా నిలించిందా లేదా అనేది తెలుసుకుందాం.

కథ:

ఓ అడ్రస్‌ కోసం హైదరాబాద్‌ మొత్తం తిరుగుతూ అవస్తలు పడుతోన్న యామిని (రాశీ ఖన్నా)కి, గౌతమ్‌ (విజయ్‌ దేవరకొండ) ఎదురుపడతాడు. యామిని గౌతమ్ ను అడ్రస్‌ ఆడుగుతుంది. గౌతమ్‌ తన మనుసును కూడా యామినికి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత యామిని, గౌతమ్‌ ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే చిన్నప్పట్నుంచి రచయిత కావాలనేది గౌతమ్‌ కళ‌. అయితే యామిని చెప్పిన ఒక్క మాట కోసం గౌతమ్‌ జాబ్ చేస్తాడు. అలా నాలుగేళ్ల ప్రేమ.. ఏడాదిన్నర సహజీనంతో జీవితం సాఫీ సాగిపోతున్న సమయంలో గౌతమ్‌కు యామిని బ్రేకప్‌ చెబుతోంది.

యామిని గౌతమ్‌కు ఎందుకు బ్రేకప్‌ చెబుతుంది? ఈ కథలోకి స్మిత(క్యాథరీన్‌), సువర్ణ(ఐశ్వర్య రాజేశ్‌), ఈజ(ఇజాబెల్లే)లు ఎందుకు ఎంటర్‌ అయ్యారు? గౌతమ్‌ సీనయ్యగా ఎలా మారాడు? గౌతమ్‌ ఎందుకు ప్యారిస్‌ వెళ్లాడు? గౌతమ్‌ చివరికి రచయితా అయ్యాడా? గౌతమ్‌ యామినిలు చివరికి కలుసుకున్నారా లేదా? అనేది కథ. ఒళ్లంతా గాయాలు, పెద్దగడ్డంతో హీరో జైళ్లో ఉన్న సీన్‌తో ఈ చిత్రం కథ ప్రారంభమవుతుంది. ప్రతీ మనిషికి కథ ఉంటుంది. తనకు ఓ కథ ఉంది అంటూ హీరో తన కథ ప్రారంభిస్తాడు. ఎవరు ఊహించని ముంగిపుతో ఎండ్ కార్డు పడుతుంది. అసలు ఈ కథలో ఉన్న ట్విస్టులు ఎంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సాంకేతికంగా..

దర్శకుడు క్రాంతి మాధవ్ ప్రేమ అంటే ఓ త్యాగం‌, సర్థుకుపోవడం‌, ప్రేమలో దైవత్వం ఉంటుంది. అనే చిన్న లైన్‌తో సినిమాను తెరకెక్కించాడు‌. జైలు సీన్‌.. ఆ తర్వాత హీరోహీరోయిన్ల మధ్య సీన్లతో కథను ఆరంభించాడు క్రాంతి మాధవ్. అయితే సినిమా మొదలైన కొద్దీసేపటికే ప్రేక్షకుడికి అసలు కథేంటో అర్థమైపోతుంది. ఫస్టాఫ్‌ అంతా సాదా సీదాగా సాగిపోయింది. హీరో ఎంట్రీ, హీరోయిన్స్‌తో రొమాన్స్‌, లవ్‌ సీన్స్‌ ఇలా సాగుంది. అయితే విజయ్‌, ఐశ్యర్యల మధ్య కొన్ని సీన్స్ కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఇక ద్వితీయార్థంలో దర్శకుడు క్రాంతి తేలిపోయాడు. కథను రక్తికట్టించడంలో తడబడ్డాడు. కొన్నీసీన్స్ ఉన్న ప్రేక్షకుడి సహనాన్ని‎ పరీక్ష పెట్టేలా ఉంటాయి. కొన్ని ఎమోషన్‌ సీన్లు ఆకట్టుకుంటాయి. ప్రి క్లైమాక్స్‌కు ముందు హీరో ఇచ్చే స్పీచ్‌ సినిమాను నిలబెట్టేలా ఉన్నా... క్లైమాక్స్‌ విషయంలో తేలిపోయాడు. అయితే కథ కొత్తగా ఉంది కొన్ని సీన్లు తెరకెక్కించడంతో క్రాంతి విజయం సాధించాడు. విజయ్‌ దేవరకొండ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరో, నలుగురు హీరోయిన్లను చాలా అందంగా చూపించారు. స్క్రీన్‌ ప్లే ప్రేక్షకుడు అర్థం చేసుకొనే విధంగా ఉంటుంది. ఎడిటింగ్‌పై దృష్టి పెట్టి కొన్ని సీన్లకు కత్తెర వేస్తే మరింత బాగుండేది. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది. సంగీతం పెద్దగా లేదనే చెప్పాలి. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. సినిమాకు తగ్గట్టుగా నిర్మాణ విలువులు ఉన్నాయి. నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడలేదు.

నటీనటులు:

విజయ్‌ దేవరకొండ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాను తన భుజస్కాందాలపై ముందుకు తీసుకెళ్లాడు. విజయ్ కోసమే గౌతమ్, శ్రీను పాత్ర పుట్టిందా? అనిపించేలా చేశాడు. అన్ని కోణాలను విజయ్‌ గొప్ప నటుడని మరోసారి రూజువు చేశాడు. రాశీ ఖన్నా మంచి నటన కనబరించింది. కొన్ని సీన్స్‌లో​అందంతో ఆకట్టుకుంది. ఐశ్వర్యా రాజేశ్ నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉంది. క్యాథరీన్‌, ఇజాలకు నటన కంటే తమ అందాల చందాలతో కుర్రకారును కట్టిపడేశారు. గౌతమ్‌ స్నేహితుడిగా ప్రియదర్శి ఆకట్టుకున్నాడు.

మొత్తంగా చెప్పాలంటే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కథ కోసం కాకుండా విజయ్ దేవరకొండ నటన కోసమేనా సినిమా చూడాల్సిందే.

సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే.. పూర్తి సినిమా థియేటర్లో చూడాల్సిందిగా కోరుతున్నాం..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories