WFL : అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే షాకవ్వాల్సిందే !

WFL : అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే షాకవ్వాల్సిందే !
x
WFL File Photo
Highlights

యూత్‌లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఉన్న క్రేజ్‌ను అంతా ఇంతా కాదు.

యూత్‌లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఉన్న క్రేజ్‌ను అంతా ఇంతా కాదు. అయితే తాజా విజయ్ దేవరకొండ హీరోగా రాశిఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఇక ఈ సినిమాకు కాంత్రి మాధవ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు చెందిన ట్రైలర్ సినిమా ప్రేక్షకులను ఈ ట్రైలర్ కట్టిపడేసింది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఫిబ్రవ‌రి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేప‌థ్యంలో సినిమా ప్రమోషన్లు భారీగా స్థాయిలో చిత్ర బృందం చేస్తుంది. అయితే ఫిబ్రవ‌రి 14న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ షాక్ గురిచేస్తున్నాయి. విడుదలకు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో బుకింగ్స్ ఒక్క హైదరాబాద్ నగరంలో 190 షోలకు ఉంటే వాటిలో బుక్ మై షో ద్వారా ఇప్పటికే 120 షోలు నిండిపోయాయి. మరో రెండు రెండు రోజుల్లో మిగ‌తా టిక్కెట్స్ కూడా అమ్ముడుపోయే అవకాశం ఉంది.

అయితే విజ‌య్ దేవరకొండ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ చూసి సినీ వర్గాలు అశ్చర్యంలో మునిగిపోయాయి. పెద్ద హీరోల రేజ్‌లో సినిమాకు టికెట్స్ బుక్ కావడం అది పండగ సందర్భం కూడా కాకపోవడంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ గురి అయ్యాయి. ఈ సినిమాలో నలుగురు అమ్మాయిలతో విజయ్ రొమాన్స్ చేయనున్నాడు. విజయ్ దేవరకొండ ఫెర్ఫార్మెన్స్‌కు ఇమేజ్ దృష్టిలో ఉంచుకొని ట్రైలర్ రూపొందిచారు. ఈ సినిమాలో రోమాన్స్ కు పెద్దపీట వేసినట్లు కనిపిస్తుంది. కేఏ వల్లభ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories