సైరాలో ఆ రెండు అద్భుతం....

సైరాలో ఆ రెండు అద్భుతం....
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా సైరా సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి మొదటి షో నుండి మంచి టాక్ వస్తుంది. దీనితో సినిమా...

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ గా సైరా సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి మొదటి షో నుండి మంచి టాక్ వస్తుంది. దీనితో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.. చిరంజీవి నటన, రామ్ చరణ్ నిర్మాణ విలువలు, సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ ,రామ్ లక్ష్మణ్ పోరాట సన్నివేశాలు ఇలా వేటికవే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈ సినిమాలోని ముఖ్యమైన సన్నివేశాలు బాగుంటాయని చిత్ర యూనిట్ ముందునుండి చెప్పుకుంటూ వస్తోంది..

మన సినిమాలు షూటింగ్ దశలో ఉన్నప్పుడు సినిమా విశేషాల్ని ఆహా.. ఒహోల్ని..చెబుతూ వస్తారు. ఒక పాటకి ఇన్ని లక్షలు పెట్టం.. ఒక ఫైట్ కి ఇన్ని రోజులు కష్టపడ్డం. ఎంతో ఖర్చు పెట్టం. ఇవే మా హైలైట్స్.. ఇలా ఎన్నో కబుర్లు చెప్పి హైప్ సృష్టిస్తారు. తీరా సినిమా విడుదలయ్యకా.. అంతా బావుండి వాళ్ళు చెప్పిన ఆ రెండు పాటలో.. సీన్లో తుస్సు మనడంతో సినిమా కూడా చాపచుట్టేస్తుంది. అయితే, ఒక్కో సినిమాలో మాత్రం దర్శక, నిర్మాతలు ఏది ఊహించి ఖర్చుకు వెనుకాడకుండా కష్టించి ఆ సీన్లు తీస్తారో.. అది సరిగ్గా కుదిరి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. ఇప్పుడు సైరా సినిమాకి అదే జరిగింది. మొదట్నుంచీ రెండు సీన్ల విషయంలో ఒక పాట..ఒక ఫైటూ అద్భుతంగా తీస్తున్నాం అంటూ సినీ వర్గం చెబుతూ వచ్చింది. వారన్నట్టే ఆ రెండూ సినిమా రేంజిని మరో మెట్టు ఎక్కించడమే కాకుండా ఆ ఫీల్ ని అనుభవించి ఆనందిస్తున్నారు. ఆ సన్నివేశాలు ఏమిటో మీరూ చూడండి.

నొసం కోట లో ఒక యుద్ద సన్నివేశం సినిమాకి జీవం పోసేలా తీయాలని డిసైడ్ అయింది టీం. అదే చెప్పింది ప్రేక్షకులకు. అన్నట్టుగానే ఆ సీన్ ని అద్భుతంగా తెరకేక్కించింది. ఈ పోరాట సన్నివేశాన్ని దాదాపుగా 35 రోజుల రాత్రులు, రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరించారు. రాజీలేని వారి శ్రమకు ఫలితం వెండితెర మీద కనిపించింది. ఆ పోరాట సన్నివేశాలు ఇప్పుడు ప్రేక్షకుల్ని దియేటర్ లో ఈలు వేశేలా.. ఇంకా చెప్పాలంటే మునివేళ్ళ మీద కూచుని సినిమా చూసేలా చేస్తోంది.

ఇక సినిమాలో అతి కీలకమైన సందర్భంలో ఓ పాట వస్తుంది. అది జాతర నేపధ్యంలో ఉంటుంది. దీని చిత్రీకరణకు 4,500 డాన్సర్ల సేవలు తీసుకున్నారు. వీరంతా స్క్రీన్ పై అద్భుతం చేశారు. ఆ పాట చిత్రీకరించిన విధానం.. కోరియోగ్రఫీ.. ఫోటోగ్రఫీ.. నేపధ్యం.. సెట్టింగ్స్.. ఇలా అన్నీ చక్కగా కుదిరాయి. ఆ పాట చూస్తున్నంతసేపు ప్రేక్షకులు కూడా ఆనాటి కాలంలోకి వెళ్ళిపోయారు. సాధారణంగా ఇటువంటి పాటలు బాలీవుడ్ లో తీస్తారు. అక్కడి ప్రేక్షకులూ చాలా ఇష్టంగా చూస్తారు. టాలీవుడ్ లో ఈ తరహా పాటలు పెద్దగా ఆదరణ పొందవనే ఓ నమ్మకం ఉంది. అదిప్పుడు పోయింది. సరిగ్గా తీస్తే.. ఆ పాట కథకు అనుగుణంగా నడిస్తే ప్రేక్షకులు బ్రహ్మ రథం పడతారనే విషయం నిరూపితమైంది.

మొత్తమ్మీద సినీ బృందం మొదటి నుంచి ఏం చెప్పిందో అంతకు రెండు రెట్లు ఎక్కువే ఇచ్చిందని చెప్పొచ్చు. చెప్పడం కాదు.. ప్రేక్షకులనుంచి వస్తున్న రెస్పాన్స్ ఈ విషయాన్ని రుజువు చేస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories