ఇకనైనా చిరంజీవి టార్గెట్ చేయటం ఆపేస్తారా?

Will You Stop Targeting Chiranjeevi
x

ఇకనైనా చిరంజీవి టార్గెట్ చేయటం ఆపేస్తారా?

Highlights

* కొరటాల శివ ని టార్గెట్ చేయటం ఆపేయమని చిరంజీవిని కోరుతున్న అభిమానులు

Chiranjeevi: ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన "ఆచార్య" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటిదాకా అసలు ఫ్లాప్ అంటే ఎరుగని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి నటించిన మొదటి సినిమాగా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. అయితే సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నుంచి ఛాన్స్ దొరికినప్పుడల్లా చిరంజీవి కొరటాల శివ పై కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

చాలాసార్లు కొరటాల శివాని టార్గెట్ చేస్తూ చిరంజీవి కొన్ని షాకింగ్ కామెంట్లు కూడా చేశారు. "ఆచార్య" సినిమా డిజాస్టర్ అవడంతో చిరంజీవి చాలా హర్ట్ అయ్యారని అందుకే కొరటాల శివ ని ఇలా పద్దాక టార్గెట్ చేస్తున్నారని కొందరు చెబుతున్నారు. అయితే కొరటాల శివ ఒక కొత్త డైరెక్టర్ కాదు. గతంలో నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన స్టార్ డైరెక్టర్. మూడు పెద్ద పెద్ద బ్యానర్ లలో పని చేశారు. ఇప్పటిదాకా ఒక నిర్మాత కూడా కొరటాల శివ గురించి నెగిటివ్ గా చెప్పలేదు.

ఇంకా కొరటాల శివ కారణంగా నిర్మాతలు భారీ ప్రాఫిట్లను కూడా అందుకున్నారు. అలాంటి కొరటాల శివ ఇప్పుడు చిరంజీవి చేస్తున్న కామెంట్లపై రియాక్ట్ అయిన కూడా అది అవమానం అనే చెప్పాలి. సినిమా ఫ్లాప్ అయితే అయిపోయింది. ఆ తర్వాత కూడా చిరంజీవి "గాడ్ ఫాదర్" ఈ మధ్యనే "వాల్తేరు వీరయ్య" వంటి సినిమాల్లో కూడా నటించారు. ఇప్పటికైనా "ఆచార్య" సినిమా గురించి మర్చిపోయి చిరంజీవి కొరటాల శివాని టార్గెట్ చేయడం ఆపేస్తే బాగుంటుందని అభిమానులు కూడా చెబుతున్నారు. మరి వీరిద్దరి మధ్య వివాదం ఎంతవరకు సద్దుమణుగుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories