మహేష్ బాబు షూటింగ్ అప్పుడే మొదలవుతుందా?

*అప్పుడే సెట్స్ పైకి వెళ్లనున్న మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా

Jyothi
Published on: 16 Oct 2022 8:30 PM IST
Will the Shooting of Mahesh Babu Start Soon?
X

మహేష్ బాబు షూటింగ్ అప్పుడే మొదలవుతుందా?

Tollywood: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతిలో ఇప్పుడు చాలానే సినిమాలు ఉన్నాయి. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న మహేష్ బాబు మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో #SSMB28 యొఅనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది కానీ తన తల్లి ఇందిరాదేవి అకాల మరణం కారణంగా కృంగిపోయిన మహేష్ బాబు ప్రణాళికలను అన్నీ వాయిదా పడ్డాయి. అయితే, ఇందిరా దేవి 13వ రోజు వేడుక తర్వాత త్రివిక్రమ్ సినిమా షూటింగ్ సెట్స్‌లో జాయిన్ అవుతాడని సమాచారం.

కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. ఒక టీవీ కమర్షియల్ షూట్ తర్వాత మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ కు ఫారిన్ వెళుతున్నారు. దసరా సెలవులలో మహేష్ తన పిల్లలకు సమయం కేటాయించలేకపోయారట. ఈ నేపథ్యంలో వారిని సెలవులకు తీసుకెళ్ళాలని నిర్ణయించుకున్నారట. త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో మార్పులు పూర్తి అవ్వలేదు అని మహేష్ ఈ సెలవు తీసుకుంటున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. టాకీ పార్ట్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉందట. ఆ తర్వాత మాత్రమే షూటింగ్‌కి వస్తాడని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్‌లో మాత్రమే #SSMB28 సెట్స్ పైకి వెళ్లనుంది అని తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story