Pawan Kalyan: ఫ్యాన్ బాయ్ సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ కి వర్కౌట్ అవుతుందా

Pawan Kalyan: ఫ్యాన్ బాయ్ సెంటిమెంట్ మీద నమ్మకం పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ అభిమానులు

Jyothi
Published on: 4 Dec 2022 6:06 PM IST
Will the Fanboy Sentiment Workout for Pawan Kalyan?
X

Pawan Kalyan: ఫ్యాన్ బాయ్ సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ కి వర్కౌట్ అవుతుందా

Pawan Kalyan: ఒక హీరోని అభిమాని ఎలా చూడాలి అనుకుంటున్నారు అనేది మరొక అభిమానికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే మామూలు డైరెక్టర్లు స్టార్ హీరోలతో సినిమాలు చేసే కంటే యువ డైరెక్టర్లు తమ అభిమాన స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే అవి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లు అవుతుంటాయి. కోలీవుడ్ లో ఈ ఫార్ములా బాగా వర్క్ అవుట్ అవుతోంది. ఉదాహరణకు డైరెక్టర్ అట్లీ తలపతి విజయ్ కి చాలా పెద్ద ఫ్యాన్. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన "తేరి", "మెర్సల్" వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లు గా నిలిచాయి.

ఇక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ కి డై హార్డ్ ఫ్యాన్. వారిద్దరి కాంబినేషన్లో ఈ మధ్యనే విడుదలైన "విక్రమ్" సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఇప్పుడు ఈ ఫ్యాన్ బాయ్ సెంటిమెంట్ మన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా వర్కౌట్ అయితే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కరియర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" సినిమాతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

ఆ సినిమా ఈ మధ్యనే "సాహో" ఫేమ్ డైరెక్టర్ సుజిత్ తో కూడా పవన్ కళ్యాణ్ ఒక సినిమాని సైన్ చేశారు. అయితే హరీష్ శంకర్ మరియు సుజిత్ ఇద్దరూ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులు. మరి ఫ్యాన్ బాయ్ సెంటిమెంట్ వీరిద్దరి విషయంలో కూడా బాగా వర్క్ అవుట్ అయ్యి పవన్ కళ్యాణ్ వీరిద్దరితో చేయబోయే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story