ఇది నిజమేనా? నాగబాబు జబర్దస్త్ ని వదిలేస్తున్నారట.. !

ఇది నిజమేనా? నాగబాబు జబర్దస్త్ ని వదిలేస్తున్నారట.. !
x
Highlights

జబర్దస్త్ షో అంటే తెలియని వాళ్ళు ఉండరు.. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు టీవీ ముందు వాలుతారు. దాదాపుగా ఆరేళ్ళ కింద స్టార్ట్...

జబర్దస్త్ షో అంటే తెలియని వాళ్ళు ఉండరు.. గురు, శుక్రవారాలు వస్తే చాలు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు టీవీ ముందు వాలుతారు. దాదాపుగా ఆరేళ్ళ కింద స్టార్ట్ అయిన ఈ షోకి ఇంతకూడా క్రేజ్ తగ్గలేదు అంటే ఈ షో ఎంతలా పాపులర్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. జబర్దస్త్ బాగా రన్ అవడంతో ఎక్స్‌ట్రా జబర్దస్త్ ను కూడా స్టార్ట్ చేసారు. అది కూడా మంచి సక్సెస్ ని సాధించి మంచి టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ షో ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా మంది కమెడియన్లు పరిచయం అయ్యారు. ఇందులో నుండి ఎంతోమంది బయటకు వెళ్లి మళ్ళీ వచ్చారు కానీ మొదటి నుండి ఈ షోకి నాగబాబు,రోజా మాత్రమే జడ్జీలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

ముఖ్యంగా నాగబాబు లేకుండా షోకి అందమే లేదు అని చెప్పాలి. స్కిట్ మధ్యమధ్యలో అయన వేసే పంచులు బాగా పేలుతాయి. అయితే ఇప్పుడు ఈ షో నుండి నాగబాబు వెళ్ళిపోతున్నారని తెలుస్తుంది. మొదటినుండి షోని డైరెక్ట్ చేసిన నితిన్ - భరత్ లు షో నుండి తప్పుకున్నారని తెలుస్తుంది. వారితో మంచి సాన్నిహిత్యం ఉన్న నాగబాబు వారు లేకుంటే షోలో నేను కూడా ఉండను అని షో కి బై బై చెప్పారని సమాచారం.. ఇక నాగబాబు కూడా వెళ్ళడంతో అయనతో పాటు షో లోని కొందరు కమెడియన్లు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు షూట్ చేసిన ఎపిసోడ్స్ లో మాత్రమే నాగబాబు కనిపించనున్నారని ఆ తర్వాత ఎపిసోడ్స్ లో ప్రేక్షకులు కొత్త జడ్జిని చూడనున్నారని ప్రచారం నడుస్తుంది చూడాలి మరి ఎం జరుగుతుందో..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories