రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ అలానే ఉంటుందా?

Will Mahesh Babu look the Same in the Rajamouli Movie?
x

రాజమౌళి సినిమాలో మహేష్ బాబు లుక్ అలానే ఉంటుందా?

Highlights

*రాజమౌళి కోసం మహేష్ బాబు లుక్కు మార్చడం లేదా?

Mahesh Babu: "సర్కారు వారి పాట" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఈసారి స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టాలీవుడ్ రేంజ్ ని మరొక సారి హాలీవుడ్ దాకా తీసుకువెళుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఇప్పటిదాకా రాజమౌళి సినిమాలలో నటించిన ప్రభాస్, రానా, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు తమ పాత్రలకు తగ్గట్టుగా కండలు తిరిగిన బాడీని తెచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు కూడా సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపిస్తారేమోనని అందరూ అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం అలాంటిదేమీ లేదని తెలుస్తోంది. తాజాగా హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ రాజమౌళి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమాలో మహేష్ బాబు తన రొటీన్ లుక్కుతోనే కనిపిస్తారని, లుక్ పరంగా మహేష్ బాబు లో పెద్దగా మార్పు లేవీ ఉండవని అన్నారు. హెయిర్ స్టైల్ తప్పించి మహేష్ బాబు కూడా కృష్ణ లాగానే ఎక్స్పరిమెంట్లు చేయడానికి ఇష్టపడరు. కానీ రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు ఎలాంటి మార్పులైనా చేయడానికి సిద్ధమవుతారని అందరూ అనుకున్నారు కానీ రాజమౌళి స్వయంగా మహేష్ బాబు కి ఎలాంటి మార్పులు అవసరం లేదు అని అనడంతో మహేష్ బాబు కూడా తన ఒరిజినల్ లుక్కుతోనే కనిపించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories