Saiyaara Movie: అందరి నోటా ‘సైయరా’ సూపర్ హిట్.. అసలు ఈ సినిమా ఎందుకంత హిట్ అయింది?

Why Is Saiyaara Trending The Real Reason Behind the Craze
x

Saiyaara Movie: అందరి నోటా ‘సైయరా’ సూపర్ హిట్.. అసలు ఈ సినిమా ఎందుకంత హిట్ అయింది? 

Highlights

Saiyaara Movie: మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాలీవుడ్ సినిమా ‘సైయరా’ గురించే వినబడుతుంది.

Saiyaara Movie: మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాలీవుడ్ సినిమా ‘సైయరా’ గురించే వినబడుతుంది. ఎంతోమంది ఈ సినిమా చూసి ఎమోషన్ అవుతున్న వీడియోలు, కొంతమంది యువత పెయింట్ అయిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది? అసలు ఇందులో ఎవరు నటించారు. ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సినిమాలో పెద్ద పెద్ద హీరోహీరోయిన్లు లేరు. అసలు ప్రచారమే లేదు. కానీ ఉన్నట్టుంటి సోషల్ మీడియాలో ఈ సినమా క్లిప్స్, సినిమా థియేటర్లలో సీన్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఇంతకీ ఏంటి రా బాబు అని చూస్తే ఏకంగా ఈసినిమా నాలుగురోజుల్లో 100 కోట్లు సంపాదించింది. అసలు ఇంతకీ ఈ సినిమాలో ఏముంది?

ఈ సినిమాలో భారీ ఫైట్స్ లేవు. అదిరిపోయే సెట్స్ లేవు. విజువల్ ఎఫెక్ట్స్ అంతకన్నా లేవు. అయినా ఈ బాలీవుడ్ సినిమా సైయారా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఉన్నది ప్రేమ కథ. అయితే ఈ ప్రేమ కథ కూడా కొత్తదేమీ కాదు. అయినా కూడా ఈ సినిమా హిట్ అయింది. దీనికి కారణం ఈ సినిమా ఎమోషన్‌ ఫీల్ కల్గించడమే.

సైయారా కథ విషయానికొస్తే.. ఇదొక సింపుల్ లవ్ స్టోరీ. క్రిష్ కపూర్‌‌కు సంగీతమంటే ఇష్టం. గొప్ప కంపోజర్ కావాలన్నది అతని కల. ఓ సందర్భంలో క్రిష్‌ని చూసిన ఒక జర్నిలిస్ట్ వాణీ బాత్రా అతడ్ని ఇష్టపడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇక్కడ వరకు బానే ఉంది. అసలు కథ అప్పుడు మొదలవుతుంది. గతంలో ఆమె ప్రేమించిన ప్రియుడు మహేశ్ ఎంటర్ అవుతాడు. మహేశ్ రాకతో కథ మలుపులు తిరుగుతుంది. అయితే చివరకు మహేశ్ వచ్చి ఏం చేస్తాడు? అసలు హీరోయిన్ ఇద్దరి అబ్బాయిల్లో ఎవరిని వివాహం చేసుకుంటుంది? అన్నదే ఈ సినిమా స్టోరీ.

ఈ సినిమాలో నటించిన హీరోహీరోయిన్లు ఇద్దరూ కొత్తవారే. కానీ నటనలో కొత్త వారన్న ఫీలింగే ఎవరికీ రాలేదు. క్రిష్‌గా అహాన్ పాండే, వాణిగా అనీత్ పడ్డా నటించారు. అహాన్ పాండే ఎవరో కాదు.. నటుడు చంకీ పాడే సొదరుడు కుమారుడు. అయితే తొలి సినిమాలోనే అద్బుతంగా నటించడంతో మంచి పేరును తెచ్చుకున్నారు. ఈ సినిమాని ఆషికీ 2 దర్శకుడు మోహిత్ సూరి దర్శకత్వం వహించారు.

ఈ సినిమాకు ఎటువంటి ప్రచారం లేదు. సోషల్ మీడియాలో యాడ్స్ లేవు. అయినా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఏకంగా 100 కోట్లు సంపాదించి పెట్టింది. కేవలం మౌత్ టాక్‌తో సినిమా హిట్ అవగలదని ఈ సినిమా నిరూపించింది. మహేశ్ బాబు, సుకుమార్ వంటి సెలబ్రెటీలు సైతం ఈ సినిమాను చూసి ఫిదా అయ్యారంటేనే చూడండి ఈ సినిమా ఎంత ఫీల్ గుడ్ సినిమానో.

Show Full Article
Print Article
Next Story
More Stories