బాహుబలి సినిమాలో అనుష్క డూప్‌గా చేసింది ఎవరో తెలుసా? ఆమె ఓ హీరోయిన్‌

బాహుబలి సినిమాలో అనుష్క డూప్‌గా చేసింది ఎవరో తెలుసా? ఆమె ఓ హీరోయిన్‌
x

బాహుబలి సినిమాలో అనుష్క డూప్‌గా చేసింది ఎవరో తెలుసా? ఆమె ఓ హీరోయిన్‌

Highlights

ప్రభాస్‌ను పాన్‌ ఇండియా స్టార్‌గా నిలిపిన చిత్రం బాహుబలి. తెలుగు సినిమాను దేశవ్యాప్తంగా కొత్త స్థాయికి తీసుకెళ్లిన ఈ సినిమా దర్శకధీరుడు రాజమౌళి క్రియేటివిటీకి నిదర్శనం. వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ప్రభాస్‌ను పాన్‌ ఇండియా స్టార్‌గా నిలిపిన చిత్రం బాహుబలి. తెలుగు సినిమాను దేశవ్యాప్తంగా కొత్త స్థాయికి తీసుకెళ్లిన ఈ సినిమా దర్శకధీరుడు రాజమౌళి క్రియేటివిటీకి నిదర్శనం. వసూళ్ల పరంగా రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ప్రభాస్ హీరోగా, రానా విలన్‌గా నటించిన ఈ సినిమాలో తమన్నా, అనుష్కలు హీరోయిన్లుగా అలరించారు.

అయితే ఈ సినిమాలో అనుష్కకు డూప్‌గా నటించింది ఎవరో తెలుసా? ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఆమె కూడా ఓ హీరోయిన్‌నే. ఆమె పేరు రుషిక రాజ్. ఈమె 2021లో విడుదలైన అశ్మీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ప్రస్తుతం కన్నడలో సినిమాలు చేస్తూ రాణిస్తోంది.

రుషికను చూస్తే అచ్చం అనుష్కలాగే ఉంటుంది. అదే హైట్‌, అదే కలర్‌తో ఉండటంతో డూప్ పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సరిపోయింది. కేవలం డూప్‌గానే కాకుండా, బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా కూడా కనిపించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈమె తన గ్లామరస్ ఫొటోలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.

ఇక అనుష్క విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఘాటీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ ఇప్పటికే మంచి హంగామా సృష్టించింది. పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్న అనుష్క ఈ చిత్రంలో మరోసారి తన నటనతో మైమరిపించనుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories