పవన్ కళ్యాణ్ - సుజిత్ సినిమా గురించి ఆసక్తికరమైన అప్డేట్..

When Pawan Kalyan next movie will launch
x

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు లంచ్ అవుతుందో తెలుసా..

Highlights

* సుజిత్ సినిమా గురించిన ఆసక్తికరమైన అప్డేట్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఇప్పుడు బోలెడు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీర మల్లు" సినిమాతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వం లో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ మధ్యనే తమిళ్లో సూపర్ హిట్ అయిన "వినోదయ సితం" సినిమాని కూడా తెలుగులో రీమేక్ చేయబోతున్న పవన్ కళ్యాణ్ "సాహో" ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ను సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

"సాహో" తో పెద్దగా మెప్పించలేకపోయినా పవన్ కళ్యాణ్ కి సుజిత్ ఒక అదిరిపోయే హిట్ ఇస్తాడని ఫాన్స్ పవన్ కళ్యాణ్ ఎలా చేయాలనుకుంటున్నారో అలానే చూపిస్తాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పాటలు కానీ ఫైట్స్ కానీ ఉండవట. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులకు మరింత ఆసక్తి ఏర్పడింది. మరికొందరు మాత్రం పాటలు ఫైట్స్ లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాని ఊహించగలమా అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ సినిమాని ఈనెల 30వ తేదీన అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. డివివి మూవీస్ పతాకంపై పై డివివి దానయ్య ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో సుజిత్ పవన్ కళ్యాణ్ కి మర్చిపోలేని హిట్ ఇస్తారా లేదా అనేది ఇంకా వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories