'అల వైకుంఠపురములో' సుశాంత్ రోల్ అదేనా ?

అల వైకుంఠపురములో సుశాంత్ రోల్ అదేనా ?
x
Highlights

సుశాంత్ రోల్ ఏంటి అన్నది ఇప్పటివరకు చిన్న క్లూ ఇవ్వకుండా మైంటైన్ చేసుకుంటూ వస్తుంది చిత్ర యూనిట్ .

చిలసౌ లాంటి డిసెంట్ హిట్టు తర్వాత హీరో సుశాంత్ ఎలాంటి హడావీడి లేకుండా సింపుల్ గా త్రివిక్రమ్ ,బన్ని సినిమాలో ఓ క్యారెక్టర్ చేస్తున్నాడు . సినిమాకి అ పాత్ర చాలా ముఖ్యమని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది . అయితే అందులో సుశాంత్ రోల్ ఏంటి అన్నది ఇప్పటివరకు చిన్న క్లూ ఇవ్వకుండా మైంటైన్ చేసుకుంటూ వస్తుంది చిత్ర యూనిట్ . ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో బన్నీ,టబు, సుశాంత్ , వెన్నెల కిషోర్ ల మధ్య సీన్స్ తెరకెక్కిస్తున్నారు .అయితే తాజా సమాచారం ప్రకారం సుశాంత్ ఇందులో బన్నికి బావమరిదిగా నటించనున్నాడని తెలుస్తుంది . సినిమాలో భాగంగా సుశాంత్ ది చాలా మంచి రోల్ అని తెలుస్తుంది . ముఖ్యంగా సినిమాలో బన్ని సుశాంత్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయని ఇన్ సైడ్ టాక్ ... ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories