ఆహా..అల్లు అరవింద్ ఫ్లాట్ ఫామ్ నుంచి ఇలాంటి వెబ్ సిరీస్.. ట్రైల‌ర్ చూస్తేనే..

ఆహా..అల్లు అరవింద్ ఫ్లాట్ ఫామ్ నుంచి ఇలాంటి వెబ్ సిరీస్.. ట్రైల‌ర్ చూస్తేనే..
x
aha ott sin web series
Highlights

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మలో పెద్ద సినిమాలు సైతం మ‌సాల కాస్త ఎక్కువ‌గానే ద‌ట్టిస్తున్నారు. అయితే ఈ సినిమాలు యుత్ ను పెడ‌దారి పట్టిస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు...

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మలో పెద్ద సినిమాలు సైతం మ‌సాల కాస్త ఎక్కువ‌గానే ద‌ట్టిస్తున్నారు. అయితే ఈ సినిమాలు యుత్ ను పెడ‌దారి పట్టిస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయినా కూడా మన దర్శక నిర్మాతల తీరు మార‌డం లేదు. ఇక వీటికి తోడు వెబ్ సిరీస్‌లు కూడా అలాగే వస్తున్నాయి. రోమాంటిక్ వెబ్ సిరీస్ లు తెలుగులో త‌క్కువ‌గానే వ‌స్తున్న‌ప్ప‌టికీ బాలీవుడ్ లో మాత్రం చాలానే ఉన్నాయి.

హిందీలో ఆల్ట్ బాలాజీ, ఉల్లు లాంటి సంస్థలు ఏడాదికి నాలుగైదు వెబ్ సిరీస్ ల‌ను నిర్మిస్తున్నారు. ఇప్పుడు తెలుగులో కూడా నిర్మాతలు వెబ్ సిరీస్ నిర్మాణం వైపు అడుగులేస్తున్నారు. అందులో భాగంగా బ‌డా నిర్మాత‌ అల్లు అరవింద్ కూడా ముందున్నాడని తెలుస్తోంది.

అల్లు అర‌వింద్ ఏకంగా ఓ అడల్ట్ వెబ్ సిరీస్ ప్లాన్ చేసాడు. అల్లు అర‌వింద్ సొంత ఓటిటి డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ లో ఆహా నుంచి సిన్ పేరుతో ఈ వెబ్ సిరీస్ వస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో జాగ్వార్ ఫేమ్ దీప్తి సోథితో పాటు జార్జ్ రెడ్డి ఫేమ్ తిరువర్ నటించారు. తాజాగా దీనికి సంబంధించి ఓ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో డ‌బుల్ మినింగ్ డైలాగ్స్ అతిగా ఉన్నాయి. న‌వీన్ మేడారం ఈ సిరీస్ తెర‌కెక్కిస్తున్నాడు.

ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే భార్యకు సెక్స్ అంటే సిగ్గు, భర్తకు మాత్రం అదే కోరిక.. ఇదే కథను భార్య ఇష్టాయిష్టాలతో పని లేకుండా భ‌ర్త ఆమె శరీరాన్ని అనుభవిస్తుంటాడు. అదే సమయంలో మధ్యలోకి మరో అమ్మాయి వస్తుంది. ఆమె హీరోను ప్రేమిస్తుంది.. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అస‌లు కథ. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మించాడు. బోల్డ్‌గా తెరకెక్కించాడు దర్శకుడు నవీన్. న‌వీన్ గ‌తంతో బాబు బాగా బిజీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories