Adivi Sesh: ఆ డైరెక్టర్ పొగరు కారణంగానే సినిమా ఆపేయాల్సి వచ్చింది..

* అసలు ఆ డైరెక్టర్ కి ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదు. సెట్స్ లో యాక్టర్స్ పై కూడా అరిచేవాడు.

R Tripura Malini
Updated on: 1 Dec 2022 6:45 PM IST
We Scrapped The Remake Film Because Of Director Arrogance Says Adivi Sesh
X

డైరెక్టర్ వల్లే సినిమాని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అంటున్న అడవి శేష్

2 States: యువ హీరో అడవి శేష్ ఈమధ్య వరుస సూపర్ హిట్ లతో కెరియర్లో ముందుకు దూసుకుపోతున్నాడు. గూఢచారి, ఎవరు, మేజర్, వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్న అడవి శేష్ బాలీవుడ్లో మంచి విజయాన్ని సాధించిన "టూ స్టేట్స్" అనే సినిమా తెలుగులో రీమేక్ లో కూడా హీరోగా నటించేందుకు సైన్ చేశారు. చేతన్ భగత్ రాసిన "టు స్టేట్స్" అనే నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం లో శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరుపుకున్న ఈ చిత్రం కొన్ని కారణాలవల్ల అటకెక్కింది.

ఇక ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిందని వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఇప్పుడు "హిట్ 2" సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న అడవి శేష్ ఈ సినిమా గురించి కూడా రియాక్ట్ అయ్యారు. పేరు చెప్పకపోయినాప్పటికీ ఒక రీమేక్ సినిమా చేయాలనుకున్నాము కానీ తనకి స్క్రిప్ట్ ఏమాత్రం నచ్చలేదని ఆ సినిమా క్యాన్సిల్ అయిందని అన్నారు.

"అసలు ఆ డైరెక్టర్ కి ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదు. సెట్స్ లో యాక్టర్స్ పై కూడా అరిచేవాడు. ఆ డైరెక్టర్ యారగన్స్ వల్లే మేము సినిమాని క్యాన్సిల్ చేసాము. కానీ సినిమా క్యాన్సిల్ చేయడమే మంచిదయింది. నిర్మాతలకి నా నెక్స్ట్ సినిమాలో షేర్ ఇచ్చాను, వాళ్లు హ్యాపీ. ఒక చెత్త సినిమాని బయటపెట్టి ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టలేదు, మన రెప్యుటేషన్ దెబ్బతినలేదు. అందరికీ మంచి జరిగింది," అని అన్నారు అడివి శేష్. ఇక "హిట్ 2" రేపు అనగా డిసెంబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story