డిమాండ్‌కు తగ్గట్టే షోలు పెంచుతున్నాం: ‘బ్యాడ్ గాళ్స్’ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో యూనిట్

డిమాండ్‌కు తగ్గట్టే షోలు పెంచుతున్నాం: ‘బ్యాడ్ గాళ్స్’ సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో యూనిట్
x
Highlights

Bad Girlz: ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’ ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Bad Girlz: ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కిన చిత్రం ‘బ్యాడ్ గాళ్స్’ ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ‘కానీ చాలా మంచోళ్లు’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ చిత్రానికి ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వం వహించారు. రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. శశిధర్ నల్ల, ఇమ్మడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ నిర్మాతలుగా వ్యవహరించారు.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది.

దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి మాట్లాడుతూ…

‘‘‘బ్యాడ్ గాళ్స్’ నిడివి చిన్నదైనా కంటెంట్ పెద్దది. అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం మా చిత్రానికి ప్రధాన బలం. ఇది అమ్మాయిల కోసం తీసిన చిత్రం. ‘జాతిరత్నాలు’, ‘మ్యాడ్’ లాంటి చిత్రాలు నచ్చినవారికి మా సినిమా కూడా నచ్చుతుంది. వస్తున్న డిమాండ్ మేరకు నిర్మాతలు థియేటర్లు, షోలు పెంచుతున్నారు’’ అని అన్నారు.

నిర్మాత శశిధర్ నల్ల మాట్లాడుతూ…

‘‘ప్రేక్షకులు ఇస్తున్న స్పందనకు ధన్యవాదాలు. థియేటర్ల నుంచి షోలు పెంచమని కాల్స్ వస్తున్నాయి. చిన్న సినిమా అయినా పెద్ద హిట్ చేశారు’’ అని చెప్పారు.

నిర్మాత రామిశెట్టి రాంబాబు మాట్లాడుతూ…

‘‘మంచి కంటెంట్‌తోనే ఈ సినిమాను తీశాం. పోటీ ఉన్నా ధైర్యంగా విడుదల చేసి సక్సెస్ అయ్యాం. డిమాండ్ మేరకు స్క్రీన్‌లు పెంచుతున్నాం’’ అని తెలిపారు.

నటీనటుల స్పందన

రోహన్ సూర్య: ఇది నా కెరీర్‌కు మంచి ఆరంభం. మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది.

పాయల్ చెంగప్ప: ఇది నా తొలి చిత్రం. ఫస్ట్ హాఫ్ యూత్ ఎంటర్‌టైన్‌మెంట్, సెకండాఫ్ ఎమోషనల్‌గా ఉంటుంది.

రోషిణి: ప్రతీ అమ్మాయి, ప్రతీ ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది.

మొయిన్: అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. మీడియా ఇంకా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను.

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ…

‘‘ఈ చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మున్నా గారు మరోసారి మంచి కంటెంట్‌తో హిట్ ఇచ్చారు’’ అని అన్నారు.

ఎడిటర్ బొంతల నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ…

‘‘కామెడీ, ఎమోషన్స్‌ను సమతుల్యంగా చూపించారు. ఇది మంచి సినిమా’’ అని ప్రశంసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories