HIT Trailer: విక్రమ్, ప్రీతిని కనిపెట్టారా? 'హిట్‌' ట్రైలర్‌ రిలీజ్

HIT Trailer: విక్రమ్,  ప్రీతిని కనిపెట్టారా? హిట్‌ ట్రైలర్‌ రిలీజ్
x
HIT MOVIE Trailer OUT
Highlights

ఈ సినిమా ట్రైలర్ విడుదలైన కొద్దీ గంటల్లోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలకు సృష్టించింది.

'ఫలక్‌నుమాదాస్‌' సినిమా ఫేమ్‌ విశ్వక్‌ సేన్‌, రుహానీ శర్మ జోడిగా తెరకెక్కుతున్న చిత్రం 'హిట్‌'. వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌లో నేచురల్‌ స్టార్‌ నాని నిర్మాణ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. 'హిట్‌' అంటే హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీం అని అర్థం ప్రోమోలో క్లారిటీ ఇచ్చేశాడు విశ‌్వక్ సేన్. పబ్‌లో మిత్రులతో సరదాగా గడిపిన ప్రీతి అనే యువతి.. మరుసటి రోజు హైవేపై కనిపించింది. అర్ధరాత్రి దాటినా ప్రీతి ఇంటికి రాకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ప్రీతి మిస్సింగ్‌ కంప్లెయింట్‌ ఇస్తారు. ఈ కేసును విక్రమ్ రుద్రరాజు ఛార్జ్ తీసుకున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టీజర్‌లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

పోలీస్‌ పాత్రలో విశ్వక్‌సేన్‌ అలియాస్‌ విక్రమ్‌ రుద్రరాజు నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో కొన్ని డైలాగ్స్ చూస్తే ప్రీతి కథతోపాటు మరొక కథ కూడా ఉన్నట్లు తెలుస్తోన్నది. ప్రీతి మిస్సింగ్‌ను మిస్టరీని పరిష్కరించే సమయంలో విక్రమ్‌ రుద్రరాజుకు ఎదురయ్యే సమస్యలేంటి? చివరికీ ప్రీతిని కనిపెట్టారా? అనేది ఈ చిత్రంలో సారాంశంగా కనిపింస్తుంది. 127 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌ అధ్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 28 ఈ సినిమా విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సినిమా ద్వారా శైలేష్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూర్చారు. మురళీ శర్మ, భానుచందర్‌ పలువురు నటినటులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories