మళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్...

Vishwak Sen Made The Same Mistake Again
x

మళ్లీ అదే పొరపాటు చేసిన విశ్వక్ సేన్

Highlights

Vishwak Sen: రెండుసార్లు దెబ్బతిన్న విశ్వక్ సేన్

Vishwak Sen: ఈ నగరానికి ఏమైంది, హిట్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన హీరో విశ్వక్ సేన్ తన సినిమాల విడుదల విషయంలో రెండుసార్లు పొరపాటు చేశారు. కరోనా ముగిసిన కొద్ది రోజులకే తన "పాగల్" సినిమాని విడుదల చేశాడు విశ్వక్. రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం చతికిలపడింది.

ఇలా విడుదల విషయంలో ఒకసారి పొరపాటు చేసిన విశ్వక్ సేన్ తాజాగా తన తదుపరి సినిమా "అశోకవనంలో అర్జున కళ్యాణం" లో కూడా అదే చేయటం అందరినీ షాక్ కి గురి చేసింది. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరో గా మే 6న థియేటర్లో విడుదల సినిమా "అశోకవనంలో అర్జున కళ్యాణం".టీజర్ మరియు ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అయితే "ఆర్ ఆర్ ఆర్", "కే జి ఎఫ్ 2" వంటి పెద్ద సినిమాల విడుదలైన కొద్దిరోజులకే ఈ సినిమాని విడుదల చేయటం సినిమాకి కొంచెం మైనస్ అయ్యింది అని చెప్పుకోవచ్చు.

విశ్వక్ సేన్ ఈ సినిమా నుంచి ఎక్కువ కలెక్షన్లు ఆశించినప్పటికి వచ్చిన కలెక్షన్లు మాత్రం అంచనాలను అందుకోకుండానే థియేటర్స్ లో ఫైనల్ రన్ ను పూర్తిచేసుకుంది. రుక్సార్ ధిల్లాన్ మరియు రితీకా నాయక్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇప్పుడు త్వరలో ఓటీటీ లో విడుదలకు సిద్దమవుతోంది. ఇలా రెండు సార్లు ఈ యువ హీరో తన సినిమాల విడుదల విషయంలో పొరపాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories