Virupaksha Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకున్న సాయిధరమ్ తేజ్ సినిమా

Virupaksha Movie First Day Collections
x

Virupaksha Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ అందుకున్న సాయిధరమ్ తేజ్ సినిమా

Highlights

Virupaksha Collections: విరూపాక్ష సినిమా మొదటి రోజు కలెక్షన్లు

Virupaksha Collections: గత కొద్ది నెలలుగా సినిమాలకి దూరంగా ఉన్న మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ ఎట్టకేలకు "విరూపాక్ష" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా విడుదల కి ముందు నుంచే మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. టీజర్ మరియు ట్రైలర్ తోనే ప్రేక్షకులు దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా నిన్న అనగా ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైంది.

మొదటి రోజు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా బాగుంది అనే కామెంట్లు చేస్తున్నారు. సినిమా థియట్రికల్ రైట్స్ 25 కోట్లకు అమ్ముడయ్యాయి. మొదటి రోజున ఈ సినిమా 6.1 కోట్లను వసూలు చేసింది. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా బాగుండడంతో రెండవ రోజు కూడా సినిమా కలెక్షన్లు బాగానే పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూస్తూ ఉంటే సాయి ధరమ్ తేజ్ ఒక మంచి హిట్ అందుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

ఏరియా వైజ్ గా విరూపాక్ష మొదటి రోజు షేర్ గ్రాస్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి:

నైజాం: 1.8 కోట్లు

సీడెడ్: 0.5 కోట్లు

ఉత్తర ఆంధ్ర: 0.54 కోట్లు

గుంటూరు: 0.46 కోట్లు

ఈస్ట్ గోదావరి: 0.38 కోట్లు

వెస్ట్ గోదావరి: 0.45 కోట్లు

కృష్ణ: 0.27 కోట్లు

నెల్లూరు: 0.2 కోట్లు

ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ: 4.6 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.4 కోట్లు

ఓవర్సీస్: 1.1 కోట్లు

వరల్డ్ వైడ్: 6.1 కోట్లు

Show Full Article
Print Article
Next Story
More Stories