Vijay Rashmika Wedding: "విరోష్" అరుదైన రికార్డు.. భారతీయ సినీ చరిత్రలో ఏ సెలబ్రిటీ జంటకు దక్కని గుర్తింపు

Vijay Rashmika Wedding
x

Vijay Rashmika Wedding: "విరోష్" అరుదైన రికార్డు.. భారతీయ సినీ చరిత్రలో ఏ సెలబ్రిటీ జంటకు దక్కని గుర్తింపు 

Highlights

ViRash Wedding: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందనల రీల్ లైఫ్ ప్రేమాయణం ఎట్టకేలకు రియల్ లైఫ్ వివాహ బంధంగా మారింది.

ViRash Wedding: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందనల రీల్ లైఫ్ ప్రేమాయణం ఎట్టకేలకు రియల్ లైఫ్ వివాహ బంధంగా మారింది. గత కొన్నేళ్లుగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై నడుస్తున్న సస్పెన్స్‌కు తెరదించుతూ, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన "విరోష్" (ViRash) వివాహ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

రాజస్థాన్‌లోని చారిత్రాత్మక మెమెంటోస్ బై ఐటీసీ హోటల్స్ వేదికగా ఈ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ ప్రైవేట్ వేడుకలో రెండు రకాల సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి.ఉదయం జరిగిన పెళ్లిలో విజయ్ పట్టు వస్త్రాల్లో ధీర గంభీరంగా కనిపించగా, రష్మిక బంగారు రంగు పట్టుచీరలో అచ్చమైన తెలుగు ఇంటి కోడలిలా మెరిసిపోయింది. రష్మిక మూలాలున్న కూర్గ్ పద్ధతిలో సాయంత్రం మరోసారి వివాహ తంతు నిర్వహించి తమ సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.

రికార్డులను తిరగరాసిన సోషల్ మీడియా వ్యూస్

పెళ్లి ఫోటోలు అప్‌లోడ్ చేసిన నిమిషాల్లోనే ఇంటర్నెట్ స్తంభించిపోయింది. భారతీయ సినీ చరిత్రలో ఏ సెలబ్రిటీ జంటకు దక్కని స్థాయిలో వీరికి డిజిటల్ రెస్పాన్స్ లభించింది.విజయ్ పోస్ట్‌కు 13 మిలియన్ల వ్యూస్ రాగా, రష్మిక షేర్ చేసిన ఫోటోలకు 15 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి.మొత్తంగా 28 మిలియన్ల వ్యూస్‌తో 'విరోష్' వెడ్డింగ్ ఫోటోలు గ్లోబల్ ట్రెండింగ్‌లో నిలిచాయి.

ప్రధాని మోడీ నుంచి సెలబ్రిటీల వరకు..

ఈ జంటకు వస్తున్న శుభాకాంక్షలు చూస్తుంటే వారు సంపాదించుకున్న క్రేజ్ ఏపాటిదో అర్థమవుతోంది.స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ లేఖ ద్వారా నూతన వధూవరులను ఆశీర్వదించడం ఈ వివాహ వేడుకలో హైలైట్‌గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి అగ్ర తారలు సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు అభినందనలు తెలిపారు. 'గీత గోవిందం'లో మొదలైన వీరి కెమిస్ట్రీ నేడు ఇలా వైవాహిక బంధంగా మారడంపై ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories