భారీ కలెక్షన్లతో ముందుకు దూసుకెళ్తున్న విక్రమ్

Vikram Movie Getting Huge Collections
x

భారీ కలెక్షన్లతో ముందుకు దూసుకెళ్తున్న విక్రమ్

Highlights

Vikram Movie: వారాంతంలో "విక్రమ్" కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి

Vikram Movie: "ఖైదీ", "మాస్టర్" వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తాజాగా ఇప్పుడు "విక్రమ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో మరియు మలయాళం స్టార్ ఫాహాధ్ ఫాసిల్ ముఖ్య పాత్రలో కనిపించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్ 3, 2022 న థియేటర్లలో విడుదలై మొదటి రోజు నుండి మంచి హిట్ టాక్ తో ముందుకు దూసుకు వెళుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే జోరుతో డీసెంట్ వసూళ్ళను రాబడుతోంది ఈ చిత్రం.

తాజాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల షేర్ ను సాధించింది. అయితే ఈరోజు నుంచి వీక్ డేస్ మొదలు కావడం తో సినిమాకి ఎంత వరకు కలెక్షన్లు అందుకుంటుందో చూడాలి. తమిళనాడులో ఈ సినిమా మూడు రోజుల్లోనే 50 కోట్ల మార్క్‌ను దాటేసింది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నరైన్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్, కాళిదాస్ జయరామ్, చెంబన్ వినోద్ దాస్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories