నాకు నో చెప్పేందుకు విజయశాంతి కథ విన్నారు!

నాకు నో చెప్పేందుకు విజయశాంతి కథ విన్నారు!
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి ఘన విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమా ద్వారా లేడి అమితాబ్ విజయశాంతి 13 సంవత్సరాల గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె పోషించిన భారతి క్యారెక్టర్ మంచి స్పందన వచ్చింది.

అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాకి ఆమెని ఒప్పించిన తీరును గురించి చెప్పుకొచ్చారు. " రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్న విజయశాంతిగారు సినిమాలు చేయోద్దనే ఆలోచనలో ఉన్నారు. కానీ నేను మాత్రం కథలు పట్టుకొని ఆమె ఇంటి చూట్టూ తిరిగేవాడిని . ఈ క్రమంలో ఆమె నన్ను చూసి కథ వినేసి నో చెప్పేస్తే వెళ్లిపోతాడు కదా అని ఆమె కథను విన్నారు. కథ వింటే చాలు నో చెప్పలేరు అనే నమ్మకంతో నేనున్నాను. ఈ క్రమంలో ఆమె కథను వినడం, నచ్చడం, చేయడం, రీ ఎంట్రీ ఇవ్వడం అన్ని జరిగిపోయాయి. ఈ సినిమా మంచి ఘనవిజయం సాధించడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. " అని చెప్పుకొచ్చాడు అనిల్..

ఇక సినిమా విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో మహేష్ మొట్టమొదటిసారిగా ఆర్మీ లుక్ లో కనిపించారు. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. రాజేంద్రప్రసాద్, సంగీత, రావు రమేష్, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, అనిల్ సుంకర, దిల్ రాజులతో కలిసి మహేష్ బాబు సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఏడూ రోజులలో వంద కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసినట్టుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాని చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాల్లో హీరోయిన్ గా కీయరా అద్వానీ నటిస్తుందని సమాచారం. పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేయనున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories