logo
సినిమా

మెగా మేనల్లుడి కోసం స్టార్ హీరో

మెగా మేనల్లుడి కోసం స్టార్ హీరో
X
Highlights

మెగా కాంపౌండ్ నుంచి మరొకరు హీరోగా టాలీవుడ్ కి పరిచయమవ్వడానికి రెడీగా ఉన్నారు. అతనే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు...

మెగా కాంపౌండ్ నుంచి మరొకరు హీరోగా టాలీవుడ్ కి పరిచయమవ్వడానికి రెడీగా ఉన్నారు. అతనే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్. సుకుమార్ అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు సానా ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుంది. అయితే మొన్నటిదాకా ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏమీ లేవు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక తమిళ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. దానికి కారణం లేకపోలేదు.

వైష్ణవ తేజ్ డెబ్యూ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడట. తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి విజయ్ సేతుపతి వైష్ణవ తేజ్ సినిమా కోసం విలన్ గా మారనున్నారు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మొదటి సినిమాతోనే ఈ మెగా మేనల్లుడు కోలీవుడ్ స్టార్ హీరోను విలన్ గా మార్చేశాడు అంటే ఆశ్చర్యం అని చెప్పుకోవాలి. తెలుగమ్మాయి మనీషా రాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story