Kingdom: టాప్ ట్రెండింగులో విజయ్ దేవరకొండి కింగ్ డమ్.. అడ్వాన్స్ బుకింగ్స్ షురూ

Kingdom
x

Kingdom: టాప్ ట్రెండింగులో విజయ్ దేవరకొండి కింగ్ డమ్.. అడ్వాన్స్ బుకింగ్స్ షురూ

Highlights

Kingdom: బుక్ మై షోలో కింగ్‌డమ్ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో ఉంది. కేవలం ఒక గంటలోనే ఈ సినిమాకు నాలుగు వేలకు పైగా టికెట్‌లు ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యాయి.

Kingdom: బుక్ మై షోలో కింగ్‌డమ్ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో ఉంది. కేవలం ఒక గంటలోనే ఈ సినిమాకు నాలుగు వేలకు పైగా టికెట్‌లు ఆన్‌లైన్‌లో అమ్ముడయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని థియేటర్లలో కొన్ని షోలు ఇప్పటికే పూర్తిగా బుక్ అయిపోయాయి. కర్ణాటకలో కూడా సినిమాకు భారీ డిమాండ్ ఉంది. బెంగళూరులోని చాలా థియేటర్లలో తెల్లవారుజామున షోలు ప్రదర్శిస్తున్నారు. బెంగళూరులో కొన్ని థియేటర్లలో ఇప్పటికే కొన్ని షోలు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఇది సినిమాకు ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈయన గతంలో జెర్సీ అనే బ్లాక్‌బస్టర్ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమాకు జాతీయ పురస్కారం కూడా వచ్చింది. కింగ్‌డమ్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. నటుడు సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇది కేవలం స్పై యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు, అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘ఇంకా రెండు రోజుల్లో మనం థియేటర్‌లో కలుద్దాం. జూలై 31న కింగ్‌డమ్ సినిమా విడుదల అవుతోంది. నా మనసులో చిన్న భయం, ఆందోళన ఉంది. మీకు సినిమా నచ్చుతుందా అనే ఉత్సుకత ఉంది. దానితో పాటు నమ్మకం కూడా ఉంది, మేము ఒక మంచి సినిమా చేశామని విశ్వాసం ఉంది. అభిమానులు కోరుకున్నట్లే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని హామీ ఇస్తున్నాను’’ అని అన్నారు.

కింగ్‌డమ్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. నాగ వంశీ ఈ సినిమాకు పెట్టుబడి పెట్టారు. విజయ్ దేవరకొండకు ఈ సినిమా విజయం చాలా అవసరం. గత కొన్ని సినిమాలు ఆశించినంత విజయం సాధించకపోవడంతో కింగ్‌డమ్ అతని కెరీర్‌కు కీలకంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories