మరోస్టార్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ మూవీ..?

Vijay Deverakonda to work with Harish Shankar
x

మరోస్టార్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ మూవీ..?

Highlights

మరోస్టార్ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ మూవీ..?

Vijay Deverakonda: డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్ వంటి డిజాస్టర్ సినిమాలతో విజయ్ దేవరకొండ కెరియర్ కి అనుకోని రీతిలో బ్రేకులు పడ్డాయి అయితే తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన "లైగర్" సినిమా కూడా డిజాస్టర్ అవడంతో విజయకి చాలా పెద్దదబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు. ఇక విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నారు. ఈసారైనా మంచి కమ్ బ్యాక్ ఇస్తారా లేదా అనే విషయాలపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు అని సమాచారం.అయితే హరీష్ శంకర్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ హీరోగా "భవదీయుడు భగత్ సింగ్" సినిమా తీయాల్సి ఉంది. చాలా కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. "గబ్బర్ సింగ్" వంటి సూపర్ హిట్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ కాంబో పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కానీ హరీష్ శంకర్ ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ తో సినిమా ఏమవుతుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే విజయ్ దేవరకొండ - హరీష్ శంకర్ ల సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories