Vijay Deverakonda: డబూ రత్నాని క్యాలెండర్‌లో విజయ్ దేవరకొండకు చోటు

Vijay Deverakonda:( Photo Instagram)
Vijay Deverakonda: బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్‌లో విజయ్ కు చోటు
Vijay Deverakonda: కుర్రాళ్లు మనసులో అనుకునే మాటలను డైరెక్టుగా అర్జున్ రెడ్డితో పలికించేశాడు సందీప్ రెడ్డి. దీంతో బోల్డ్ అండ్ వయిలెంట్ కేరెక్టర్ అర్జున రెడ్డికి పిచ్చ క్రేజ్ వచ్చేసింది. కోపమొస్తే కొట్టేయాలి.. అడ్డమొస్తే తిట్టేయాలి.. మూడ్ వస్తే అన్నీ చేసేయాలి అనే రేంజ్ లో ఆ కేరెక్టర్ ఉండటంతో కుర్రాళ్లకు నచ్చేసింది.. ఆ కేరెక్టర్ లో జీవించిన విజయ్ దేవరకొండ ఆ ఒక్క సినిమాతో స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఆ క్రేజీ లైగర్ మరో క్రేజీ క్యాలెండర్ లో కనిపించబోతున్నాడు.
తన తొలి పాన్ ఇండియా చిత్రం 'లైగర్' విడుదలకు ముందే విజయ్ దేవరకొండ ఉత్తరాది ప్రేక్షకులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాడు. బాలీవుడ్ తారలు సైతం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ప్రముఖ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్‌లో విజయ్ చోటు సంపాదించాడు. సినీ ప్రముఖుల ఫొటోలతో ప్రచురితమయ్యే 'డబ్బూ రత్నాని 2021 క్యాలెండర్'లో విజయ్ మెరవబోతున్నాడు.
విజయ్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఎంతో సమయస్ఫూర్తి కలిగిన నటుడు విజయ్ అంటూ రౌడీ హీరోపై డబూ ప్రశంసలు కురిపించారు. క్యాలెండర్ షూట్‌లో భాగంగా కండలు తిరిగిన దేహంతో బైక్‌పై కూర్చొని మాస్ లుక్‌లో విజయ్ ఫొటోలకు పోజులిచ్చాడు. ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేశాడు. ఈ సందర్భంగా.. ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పలు విషయాలు పంచుకున్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ''నేను నటుడిని కావాలనుకోవడానికి ముందు నుంచే నాకు డబూ రత్నాని క్యాలెండర్ గురించి తెలుసు. ఈ క్యాలెండర్‌ను ప్రారంభించినప్పుడు నా వయసు తొమ్మిదేళ్లు. షారుఖ్‌ఖాన్ ఎక్కువగా ఈ క్యాలెండర్‌లో రావడాన్ని నేను చూస్తుండేవాడిని. అలా షారుఖ్‌ను ఆరాధించేవాడిని. ఆయన ఎంతో ప్రశాంతంగా ఉంటారు. నేను కూడా ఆయనలా ఏదో ఒకరోజు క్యాలెండర్‌లో కనిపించాలనుకున్నాను. ఇప్పుడు ఆ పని పూర్తి చేశానని భావిస్తున్నాను. ఈ ఫొటోషూట్ చిటికెలో అయిపోయింది. రత్నానితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది' అని విజయ్ అన్నాడు.
జనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMTప్రధాని సంచలన నిర్ణయం.. అదృష్టం కోసం తన పుట్టిన రోజు మార్పు..
21 May 2022 1:30 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMT
World Economic Forum: ప్రముఖులతో సీఎం జగన్ భేటీ
22 May 2022 3:00 PM GMTChandigarh: ఉత్తరాదిన మీటర్ల ఇష్యూ లేవనెత్తిన కేసీఆర్..
22 May 2022 2:30 PM GMTచెత్తకుప్పలను తలపిస్తున్న చార్ధామ్ రోడ్లు.. పెను ప్రమాదం పొంచి ఉందని...
22 May 2022 2:00 PM GMTJogi Ramesh: సీఎం జగన్ దావోస్ వెళ్తే టీడీపీ నాయకులకు కడుపు మంట ఎందుకు?
22 May 2022 1:30 PM GMTభారత్‌పై మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రశంసల జల్లు
22 May 2022 1:00 PM GMT