Vijay Deverakonda: "జనగణమన" గురించి వదిలేయండి అంటున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Says to Leave Jana Gana Mana
x

Vijay Deverakonda: "జనగణమన" గురించి వదిలేయండి అంటున్న విజయ్ దేవరకొండ

Highlights

Vijay Deverakonda: "లైగర్" రిజల్ట్ మర్చిపోండి అంటున్న విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. మరోవైపు సినిమా రిలీజ్ కు ముందే పూరీ తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ "జన గణ మన" ని విజయ్ తో అధికారికంగా ప్రకటించారు.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. కానీ ఈ మధ్యనే విడుదలైన "లైగర్" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో "జనగణమన" వంటి భారీ బడ్జెట్ సినిమా చేయలేమని నిర్మాతలు వెనకడుగు వేసేశారు. తాజాగా సైమా అవార్డుల వేడుక కు హాజరయ్యారు విజయ్ దేవరకొండ.

ఈ నేపథ్యంలో "జనగణమన" గురించి అడగగా, విజయ్ చాలా తెలివిగా తప్పించుకున్నారు. "ఇది సైమా ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం. మిగతా అన్నిటి గురించి మర్చిపోయి ఈ రాత్రి ఎంజాయ్ చేయండి" అని మాట దాటేసారు విజయ్ దేవరకొండ. తన ఫ్లాప్ సినిమాల గురించి కూడా చాలా ఓపెన్ గా మాట్లాడే విజయ్ దేవరకొండ ఈసారి మాత్రం ఇలా మొహం చాటేయడం అభిమానులకు కూడా షాక్ ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories