Vijay Deverakonda-Rashmika Wedding: విజయ్ దేవరకొండ పెళ్లిపై తరుణ్ భాస్కర్ పంచ్!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఈ రెండు పేర్లు వినబడితే చాలు సోషల్ మీడియాలో చర్చలు మామూలుగా ఉండవు.

Naresh.k
Published on: 9 Feb 2026 7:55 PM IST
Vijay Deverakonda-Rashmika Wedding: విజయ్ దేవరకొండ పెళ్లిపై తరుణ్ భాస్కర్ పంచ్!
X

Vijay Deverakonda-Rashmika Wedding: విజయ్ దేవరకొండ పెళ్లిపై తరుణ్ భాస్కర్ పంచ్!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఈ రెండు పేర్లు వినబడితే చాలు సోషల్ మీడియాలో చర్చలు మామూలుగా ఉండవు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ జరుగుతున్న ప్రచారం, ఇప్పుడు ఏకంగా పెళ్లి వార్తల వరకు వెళ్ళింది. ముఖ్యంగా ఫిబ్రవరి 26న ఈ జంట ఒక్కటి కాబోతున్నారనే వార్త నెట్టింట షేక్ చేస్తోంది. తాజాగా ఈ వార్తలపై విజయ్ దేవరకొండ అత్యంత సన్నిహితుడు, దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందించిన తీరు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాయపడ్డ సింహం’. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఈవెంట్‌లో తరుణ్ భాస్కర్‌కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. విజయ్ దేవరకొండ పెళ్లి అంట కదా.. మీరు వెళ్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తరుణ్ తనదైన శైలిలో ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. నాకు ఇంకా ఇన్విటేషన్ రాలేదు బ్రో! ఒకవేళ ఇన్విటేషన్ వచ్చిన వెంటనే మీకు వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేస్తాను. మనమంతా కలిసి టక్కున వెళ్ళిపోదాం.. దానికి వీసా కూడా అవసరం లేదు" అంటూ నవ్వులు పూయించారు.

విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఆ సినిమాతో మొదలైన వీరి బాండింగ్ ఇప్పటికీ అలాగే ఉంది. అందుకే విజయ్ పెళ్లి విషయం తరుణ్‌కు తప్పకుండా తెలిసి ఉంటుందని అందరూ ఆశించారు. కానీ, తరుణ్ మాత్రం ఈ విషయాన్ని చాలా తెలివిగా, సరదాగా దాటవేశారు. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇవ్వకపోయినా, ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

విజయ్ - రష్మిక తమ రిలేషన్‌షిప్ గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా నోరు విప్పలేదు. కానీ, వీరిద్దరూ కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లడం, ఒకే రకమైన ఫొటోలు షేర్ చేయడంతో అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు ఫిబ్రవరి 26 డేట్ వైరల్ అవుతుండటంతో.. మరికొద్ది రోజుల్లోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ‘గాయపడ్డ సింహం’ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అటు సినిమా ప్రమోషన్స్, ఇటు విజయ్ పెళ్లి టాపిక్.. మొత్తానికి తరుణ్ భాస్కర్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచారు.

Naresh.k

Naresh.k

Next Story