Virosh Marriage Update: విరోష్ వివాహానికి ప్రధాని శుభాకాంక్షలు.. వైరల్ లేఖ

Virosh Marriage Update
x

 Virosh Marriage Update: విరోష్ వివాహానికి ప్రధాని శుభాకాంక్షలు.. వైరల్ లేఖ

Highlights

Virosh Marriage Update: విజయ్ దేవరకొండ–రష్మిక వివాహానికి ప్రధాని కార్యాలయం నుంచి శుభాకాంక్షలు. ఉదయ్‌పూర్‌లో పెళ్లి, హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహణకు ఏర్పాట్లు.

సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ వేడుకకు సంబంధించి ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. త్వరలో వివాహబంధంతో ఒక్కటి కానున్న ఈ జంటకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం నుంచి శుభాకాంక్షలు అందినట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు పంపిన వివాహ ఆహ్వాన పత్రికకు స్పందించిన ప్రధాని కార్యాలయం లేఖ ద్వారా అభినందనలు తెలియజేసినట్లు తెలుస్తోంది. సప్తపది వేడుకతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న ఈ జంట జీవితాంతం స్నేహభావంతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఇరువురు కుటుంబ సభ్యులకు కూడా అభినందనలు తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల్లో కలిసి నటించి మంచి క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంట ఈ నెల 26న వివాహం చేసుకోనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో వివాహ విందు కార్యక్రమం జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories