Vijay-Rashmika Mandanna: 'నా భర్తని పరిచయం చేస్తున్నా'.. వెడ్డింగ్ పిక్స్ షేర్ చేసిన రష్మిక!

Vijay-Rashmika
x

Vijay-Rashmika Mandanna: 'నా భర్తని పరిచయం చేస్తున్నా'.. వెడ్డింగ్ పిక్స్ షేర్ చేసిన రష్మిక!

Highlights

Vijay Deverakonda-Rashmika Mandanna: టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు

Vijay Deverakonda-Rashmika Mandanna: టాలీవుడ్ హీరో విజయ్‌ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గురువారం (ఫిబ్రవరి 26) ఉదయం 10.10కి రష్మిక మెడలో విజయ్‌ మూడు ముళ్లు వేశారు. దాంతో టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా హాట్ టాపిక్‌గా ఉన్న విజయ్–రష్మిక ప్రేమ కథ.. మూడు ముళ్ల బంధంతో మరింత బలపడింది. తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను రష్మిక అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘హాయ్‌ మై లవ్స్‌. నా భర్తను మీకు పరిచయం చేస్తున్నా.. మిస్టర్‌ విజయ్‌ దేవరకొండ ’ అని రాసుకొచ్చారు.

'నాకు నిజమైన ప్రేమ అంటే ఏమిటో నేర్పించిన వ్యక్తి నువ్వే. ప్రశాంత అంటే ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి నువ్వే. మన కలలు, లక్ష్యాలు.. పెద్దగా, గొప్పగా ఉండాలని ప్రతిరోజూ నాకు చెప్పే వ్యక్తి నువ్వే. నేను ఊహించిన దానికంటే ఎక్కువ సాధించగలనని నన్ను నమ్మిన వ్యక్తి నువ్వే. నాలోని శక్తి సామర్థ్యాలను నిరంతరం గుర్తు చేసే వ్యక్తి నువ్వే. నా భావాలను నిరభ్యంతరంగా వ్యక్తపరిచినా ఎప్పుడూ అడ్డు చెప్పని వ్యక్తి నువ్వే. ఫ్రెండ్స్‌తో ట్రావెల్ చేయడం ఎంత అద్భుతమో చూపించిన వ్యక్తి నువ్వే. నిజం చెప్పాలంటే… నీ గురించి ఒక పుస్తకం రాయగలను' అంటూ విజయ్‌ దేవరకొండ గురించి రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

'నేను కలగన్న మహిళగా మారాను అంటే.. అది నువ్వే. నన్ను అలా తీర్చిదిద్దినందుకు నిజంగా అదృష్టవంతురాలిని. విజ్జూ.. నీ గురించి నాలో ఉన్న భావాలను చెప్పడానికి మాటలు సరిపోవు అని నేను ఎప్పుడూ చెప్పేదాన్ని. ఇప్పుడూ అదే చెబుతున్నా. ఇప్పుడు విజయాలు, కష్టాలు, సంతోషాలు, బాధలు.. నా జీవితంలోని ప్రతి క్షణం ఒక్కసారిగా అర్థవంతంగా అనిపిస్తోంది. ఎందుకంటే వాటన్నింటికి నువ్వు సాక్షిగా ఉన్నావు. నా విజయంలో పెద్ద భాగంగా ఉన్నావు. నీ భార్యగా మారానన్న ఆలోచనతో నేను ఎంత ఎగ్జైటెడ్‌గా ఉన్నానో చెప్పలేను. నీ భార్యగా ఉండటం.. నిన్ను నా భర్త అని పిలవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు పూర్తి సెలబ్రేషన్ టైమ్. మనిద్దరం కలిసి జీవితంలో అత్యంత అందమైన జీవితం గడుపుదాం. ఐ లవ్‌ వ్యూ' అంటూ రష్మిక తన ప్రేమను పంచుకున్నారు. అందరూ నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories