మళ్లీ విజయ్ దేవరకొండ బౌన్స్ బ్యాక్ అవుతాడా?

Vijay Deverakonda is struggling like a star hero
x

విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా తో బయటపడతాడా

Highlights

* విజయ్ తదుపరి సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయ౦పై ఆలోచనలో పడ్డాడు

Vijay Devarakonda: ఇండస్ట్రీ లో చాలా తక్కువ కాలంలోనే స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం వంటి సినిమాలతో స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. కానీ వరుస డిజాస్టర్ లతో విజయ్ దేవరకొండ క్రేజ్ బాగా తగ్గిపోయింది. మాస్ ఎంటర్‌టైనర్‌ సినిమా అయినప్పటికీ "లైగర్" తో విజయ్ పెద్ద డిజాస్టర్ అందుకున్నాడు. అసలు అలాంటి కంటెంట్ లేని స్క్రిప్ట్‌ ను విజయ్ ఎలా నమ్మాడు అని అభిమానులు సైతం షాక్ అయ్యారు. అసలు లైగర్ సినిమాకి సీక్వెల్ కూడా చేయాలని అనుకున్నా విజయ్ దేవరకొండ ఈ సినిమా డిజాస్టర్ చూసి ఆ ప్లాన్లను మానుకున్నారు.

"లైగర్" డిజాస్టర్ అవ్వడంతో విజయ్ తదుపరి సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయమై ఆలోచనలో పడ్డాడు. ఇప్పటికే హరీష్ శంకర్, పరశురామ్, బుచ్చిబాబు వంటి చాలామందికి డైరెక్టర్లు విజయ్ దేవరకొండ వెయిటింగ్ లిస్టులోనే ఉన్నారు. నిజానికి స్టార్ హీరోలకి ఇలాంటి వెయిటింగ్ అంత కొత్త కాదు. మెగాస్టార్ చిరంజీవి లాంటి దిగ్గజాలు కూడా హిట్లర్ సినిమాకి ముందు ఎన్నో ఫెయిల్యూర్స్ అందుకున్నారు. మహేష్ బాబు మరియు జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా సంవత్సరాల పాటు డిజాస్టర్ లు అందుకున్న వారే. మరి విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా "ఖుషి" తో డిజాస్టర్ల నుంచి బయటపడతాడో లేదో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories