Spirit: ప్రభాస్ 'స్పిరిట్'లో తెలుగు స్టార్ హీరో..? ఇక బాక్సాఫీస్ బద్దలే..!

Spirit
x

Spirit: ప్రభాస్ 'స్పిరిట్'లో తెలుగు స్టార్ హీరో..? ఇక బాక్సాఫీస్ బద్దలే..!

Highlights

Spirit: ప్రభాస్ 'స్పిరిట్' సినిమా చుట్టూ ఇప్పుడు అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పక్కర్లేదు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సెన్సేషనల్ సినిమాలతో ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. డార్లింగ్ ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Spirit: ప్రభాస్ 'స్పిరిట్' సినిమా చుట్టూ ఇప్పుడు అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పక్కర్లేదు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సెన్సేషనల్ సినిమాలతో ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. డార్లింగ్ ప్రభాస్‌ను ఎలా చూపిస్తాడో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' చిత్రం రోజుకో క్రేజీ అప్‌డేట్‌తో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని క్లారిటీ వచ్చేసింది. కానీ, తాజాగా సందీప్ వంగా చేసిన ఒక ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సందీప్ వంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎటువంటి క్యాప్షన్ లేకుండా 'అర్జున్ రెడ్డి' షూటింగ్ నాటి విజయ్ దేవరకొండ ఫోటోను షేర్ చేశారు. సాధారణంగా వంగా ఏదైనా పోస్ట్ చేస్తే దాని వెనుక గట్టి కారణమే ఉంటుంది. దీంతో, ప్రభాస్ 'స్పిరిట్'లో విజయ్ ఒక కీలక పాత్రలో లేదా పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపిస్తున్నారా? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 'అర్జున్ రెడ్డి'తో విజయ్ కెరీర్‌ను మార్చేసిన వంగా, ఇప్పుడు ప్రభాస్ సినిమాలో అతడిని సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌గా చూపించబోతున్నాడా అన్న అనుమానాలు బలపడుతున్నాయి.

రూమర్లు అక్కడితో ఆగలేదు. ఈ చిత్రంలో ప్రభాస్‌ను ఢీకొట్టే విలన్‌గా మాస్ హీరో గోపీచంద్ నటిస్తున్నట్లు టాక్ రాగా.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే 'స్పిరిట్' బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీగా నిలిచిపోవడం ఖాయం. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, కొరియన్ స్టార్ డాన్ లీ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. సందీప్ వంగా మార్క్ యాక్షన్, ప్రభాస్ కటౌట్.. వీటికి తోడు విజయ్ దేవరకొండ, చిరు వంటి స్టార్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్టే.

Show Full Article
Print Article
Next Story
More Stories