Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సింప్లిసిటీ కి ఫిదా అయిన ఫ్యాన్స్

Vijay Deverakonda Fans Shocked by the Fan initiative
x

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సింప్లిసిటీ కి ఫిదా అయిన ఫ్యాన్స్ 

Highlights

Vijay Deverakonda: అభిమాని చొరవ తో షాక్ అయిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్

Vijay Deverakonda: రౌడీ బాయ్ గా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తన దయాగుణం మరియు మంచితనం తో కూడా ఎప్పటికప్పుడు అభిమానుల హృదయాలను గెలుచుకుంటూ ఉంటాడు. ప్రతి సంవత్సరం తన అభిమానుల కోసం విజయ్ దేవరకొండ 'శాంతా క్లాజ్' గా మారి వారి కోరికలను కూడా తీరుస్తూ ఉంటాడు. గతేడాది కూడా "దేవర శాంతా" పేరుతో ఒక 100 మంది అదృష్ట అభిమానులను హాలిడే కోసం మనాలి కి పంపిస్తా అని ప్రమాణం చేసిన విజయ్ దేవరకొండ తన మాట నిలబెట్టుకున్నాడు.

ఫిబ్రవరి 17 న 100 మంది అభిమానులతో పాటు విజయ్‌ కూడా మనాలి వెళ్లి వారితో కొంత సమయం గడిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఒక వీడియోలో ఒక ఫ్యాన్ విజయ్ భుజంపై చేతులు వేస్తూ "ఖుషీ" సినిమాతో విజయ్ దేవరకొండ మంచి హిట్ అందుకుంటాడు అని చెప్పాడు.

అయితే ఒక అభిమాని భుజాలపై చేతులు వేసేంత చొరవ తీసుకున్నా కూడా విజయ్ మాత్రం చాలా సైలెంట్ గా డౌన్ టు ఎర్త్ గా ప్రవర్తించిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అభిమానులతో ఇంత స్నేహంగా ఉండే హీరోలు చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ విజయ్ దేవరకొండ మాత్రం సింప్లిసిటీకి పర్యాయపదంగా ఉన్నాడు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం తన స్థాయిలో ఉన్న స్టార్ అభిమానులను ఇలా చేయకూడదని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories