Vijay Rashmika : విజయ్ దేవరకొండ - రష్మిక ఎంగేజ్‌మెంట్.. ఎట్టకేలకు ప్రేమ కథకు పెళ్లి బంధం

Vijay Rashmika : విజయ్ దేవరకొండ - రష్మిక ఎంగేజ్‌మెంట్.. ఎట్టకేలకు ప్రేమ కథకు పెళ్లి బంధం
x

Vijay Rashmika : విజయ్ దేవరకొండ - రష్మిక ఎంగేజ్‌మెంట్.. ఎట్టకేలకు ప్రేమ కథకు పెళ్లి బంధం

Highlights

టాలీవుడ్‎లో ఎప్పటి నుంచో చర్చలో ఉన్న ప్రేమజంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమాయణం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.

Vijay Rashmika :టాలీవుడ్‎లో ఎప్పటి నుంచో చర్చలో ఉన్న ప్రేమజంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమాయణం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. గత చాలా కాలంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నా, అధికారికంగా ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ వారి సోషల్ మీడియా పోస్టులు, ఫోటోలు, విదేశీ పర్యటనలు, వెకేషన్స్ చూస్తే వీళ్ళు డేటింగ్‎లో ఉన్నారని చాలాసార్లు స్పష్టమైంది. ఇప్పుడు, వీరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త నిజమైంది విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం శుక్రవారం (అక్టోబర్ 3) ఉదయం విజయ్ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది.

విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థ వేడుక అత్యంత గోప్యంగా, నిరాడంబరంగా జరిగిందని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, వారి బంధం ప్రారంభమైనట్లే, ఈ వేడుకను కూడా చాలా ప్రైవేట్‌గా నిర్వహించారు. దీని గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, విశ్వసనీయ వర్గాల నుండి ఈ వార్త బయటకు వచ్చింది.

నిశ్చితార్థం జరిగిన నేపథ్యంలో విజయ్-రష్మికల వివాహం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఇతర సెలబ్రిటీల మాదిరిగానే వీరు కూడా ఒక డెస్టినేషన్ వెడ్డింగ్‎ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే, పెళ్లి వేదిక, తేదీల గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వారి ప్రేమ కథకు ఇది ఒక శుభ ముగింపు కావడం పట్ల ఇరు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని సమాచారం.

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న కలిసి గీత గోవిందం సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ విజయం సాధించడమే కాకుండా, వీరిద్దరి మధ్య ఒక మంచి స్నేహబంధాన్ని ఏర్పరచింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలో ప్రేమజంటగా మరోసారి తెరపై సందడి చేశారు. ఈ రెండు సినిమాలు వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని మాత్రమే కాకుండా, ఆఫ్-స్క్రీన్ సంబంధాన్ని కూడా మరింత బలపరిచాయి. ప్రస్తుతం విజయ్, రష్మిక ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్స్‌గా మంచి గుర్తింపు పొందారు. విజయ్ దేవరకొండ ఇటీవల కింగ్డమ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. రష్మిక కూడా దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‎లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories