World Famous Lover తొలిరోజు కలెక్షన్స్

World Famous Lover తొలిరోజు కలెక్షన్స్
x
వరల్డ్ ఫేమస్ లవర్ తొలిరోజు కలెక్షన్స్
Highlights

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా విడుదల అయ్యింది.

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటించారు. రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజబెల్లా విజయ్ దేవరకొండతో జతకట్టారు. వాలెంటైన్స్ డే సందర్బంగా శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1150 స్క్రీన్స్‌లో విడుదలైంది. తొలి రోజు కలెక్షన్లు చూస్తే విజయ్ దేవరకొండ బాక్సాఫీసు ముందు సత్తాచాటాడాలేదో చూదాం..

ప్రేమికులరోజు విడదలైన ఈ సినిమా తొలిరోజు భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు ప్రేక్షకులు ము‌ఖ్యంగా సినిమా ఫస్ట్ రోజే చూడాలని క్యూట్టారు. దీంతో సినిమా టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు కలెక్షన్లు కొల్లకొట్టింది. 'వరల్డ్ ఫేమస్ లవర్' థియేట్రికల్ రైట్స్ రూ.23.81 కోట్లకు అమ్ముడుపోయింది. కాగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.6.5 కోట్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్‌డే రూ.8 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆక్యుపెన్సీ రేట్ 70.19 శాతం ఉందని టాక్.

ఈ సినిమానే తన చివరి ప్రేమ కథా చిత్రమని విజయ్ ప్రేక్షకులకు పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పారు. ప్రేక్షకులు సినిమాలకు కొత్త అనుభూతి కోసం వస్తుంటారు. వారిఆ అనుభూతి పొందాలనే సినిమాలు తీస్తా.. అని విజయ్ చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రీరిలీజ్ ఈవెంట్ రోజు బంతిని గాల్లోకి బలంగా కొట్టాను సిక్స్ పడాలి అని కూడా వ్యాఖ్యానించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోట్లుపైగా వసూళ్లు చేసి విజయ్ సిక్స్ కొట్టాడనే చెప్పాలి.

యామిని (రాశీ ఖన్నా), గౌతమ్‌ (విజయ్‌ దేవరకొండ) యామిని, గౌతమ్‌ ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే చిన్నప్పట్నుంచి రచయిత కావాలనేది గౌతమ్‌ కళ‌. అయితే యామిని చెప్పిన ఒక్క మాట కోసం గౌతమ్‌ జాబ్ చేస్తాడు. అలా నాలుగేళ్ల ప్రేమ.. ఏడాదిన్నర సహజీనంతో జీవితం సాఫీ సాగిపోతున్న సమయంలో గౌతమ్‌కు యామిని బ్రేకప్‌ చెబుతోంది. సువర్ణగా (ఐశ్వర్య రాజేష్) పెర్ఫామెన్స్‌కి ప్రేక్షకులు మార్కులు వేశారు. సినిమాలో మెయిన్ హీరోయిన్ రాశీ ఖన్నానే అయితే .. సువర్ణ పాత్రలో ఐశ్వర్య అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీను, గౌతమ్ పాత్రల్లో విజయ్ దేవరకొండ పూర్తిస్థాయిలో ఇరగదీశాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories