ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన విజయ్ దేవరకొండ

Vijay Devarakonda with The Family Man Directors | Tollywood News
x

 ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన విజయ్ దేవరకొండ

Highlights

ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: అసలే పరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ కెరియర్లో "లైగర్" సినిమాతో మరొక ఫెయిల్యూర్ ఎదురయ్యింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ కారీర్ ఎటు వెళుతుందో అని అభిమానులు కంగారుపడుతుండగా ఇప్పుడు ఎట్టకేలకు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ కోసం ఒక కథ లాక్ అయ్యింది.

ఈమధ్యనే దర్శక ద్వయం రాజ్ మరియు డీకే విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ కి ఒక కథ చెప్పారు. అది విజయ్ కి కూడా బాగా నచ్చింది. ఆ కథ అశ్వనీదత్ దగ్గరికి వెళ్ళగా, ఆయన కూడా ఇంప్రెస్ అయ్యారు. ప్రస్తుతం కథ చర్చలు ఇంకా జరుగుతున్నాయి. ఈ కథ దాదాపు ఓకే అయిపోయినట్లేనని సమాచారం. బాలీవుడ్ లో విలక్షణమైన చిత్రాలు, వెబ్ సిరీస్ చేసిన వీరు 'ది ఫ్యామిలీ మ్యాన్‌' సిరిస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా మంచి సినిమా చేయాలనీ ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్న వీరు విజయ్ దేవరకొండ సినిమాతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories