విజయ్ దేవరకొండ ఇంద్రగంటి తో సినిమా చేస్తాడా?

Vijay Devarakonda Movie with Mohana Krishna Indraganti
x

విజయ్ దేవరకొండ ఇంద్రగంటి తో సినిమా చేస్తాడా?

Highlights

విజయ్ దేవరకొండ ఇంద్రగంటి తో సినిమా చేస్తాడా?

Vijay Devarakonda-Indraganti: ఎంత టాలెంట్ ఉన్నా సరే కొన్ని కొన్ని సార్లు లక్ కూడా ఇండస్ట్రీలో అవసరం పడుతుంది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటే ఆ హీరో లేదా డైరెక్టర్ కు ప్రేక్షకులలో క్రేజ్ తగ్గిపోతుంది. దీంతో వారికి అవకాశాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరిగింది. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ సినిమాలతో విజయ్ దేవరకొండ క్రేజ్ బాగా పడిపోయింది. విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాధ్ ల కాంబోలో రావాల్సిన "జనగణమన" సినిమాకి కూడా బ్రేకులు పడ్డాయి.మరోవైపు ఇంద్రకంటి మోహనకృష్ణ కూడా రెండేళ్ల విరమణ తర్వాత "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను అందుకుంది. నిజానికి విజయ్ దేవరకొండ మరియు ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నారు. అయితే విజయ్ దేవరకొండ కోసం ఇప్పటికే దిల్ రాజు చాలామంది డైరెక్టర్ల నుంచి కథలను విన్నారు కానీ అందులో ఏ కథా నచ్చలేదు. ఇక "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" సినిమా డిజాస్టర్ తర్వాత దిల్ రాజు విజయ్ దేవరకొండ ని ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా చేయనిస్తారా లేదా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories