Vijay Devarakonda: ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో సాగనున్న విజయ్ దేవరకొండ సినిమా

Vijay Devarakonda Movie Set in the Army Background
x

Vijay Devarakonda: ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో సాగనున్న విజయ్ దేవరకొండ సినిమా

Highlights

Vijay Devarakonda: మేజర్ పాత్రలో కనిపించనున్న రౌడీ బాయ్

Vijay Devarakonda: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ "నిన్నుకోరి" మరియు "మజిలీ" ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారు. స్టార్ బ్యూటీ సమంత ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ను సంప్రదించారట. కానీ వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్నా ఆమె ఈ ఆఫర్ ను తిరస్కరించింది అని తెలుస్తోంది.

ఆ తర్వాత చిత్ర బృందం సమంతానే సంప్రదించారని ఇంతకుముందు మజిలీ సినిమాలో శివ నిర్వాణ డైరెక్షన్ లో నటించిన సమంత ఈ సినిమాలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో సాగనుందని, ఇందులో విజయ్ దేవరకొండ ఒక మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వం వహించిన మజిలీ, నిన్నుకోరి లాగానే ఈ సినిమా కూడా మనసుకు హత్తుకునే ఒక ప్రేమ కథ లాగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories