logo
సినిమా

మజిలీ డైరెక్టర్ కి నాలుగు నెలలు మాత్రమే సమయం ఇస్తున్న "మహానటి" జంట.. అందుకేనా..?

Vijay Devarakonda and Samantha Giving 4 Months to Shiva Nirvana to Complete Movie
X

మజిలీ డైరెక్టర్ కి నాలుగు నెలలు మాత్రమే సమయం ఇస్తున్న "మహానటి" జంట.. అందుకేనా..? 

Highlights

Samantha - Vijay Devarakonda: మహానటి సినిమా కలిసి నటించిన ఈ జంట మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది...

Samantha - Vijay Devarakonda: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఇప్పుడు స్టార్ట్ బ్యూటీ సమంత తో కలిసి ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే మహానటి సినిమా కలిసి నటించిన ఈ జంట మళ్లీ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మజిలీ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అయితే ప్రస్తుతం లైక్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమాతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత జనగణమన సినిమాతో బిజీ కాబోతున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలవడానికి 4 నెలల సమయం ఉందట. మరోవైపు సమంత కూడా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో ఒక వెబ్ సిరీస్ లో నటించాల్సి ఉంది. ఈ షూటింగ్ కూడా కొన్ని నెలల తర్వాత మొదలు కాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ మరియు సమంత ఇద్దరికీ సమయం ఉంది కాబట్టి తమ సినిమాని నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మరియు సమంత కేవలం నాలుగు నెలలు మాత్రమే డేట్లు ఇస్తామని దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిజానికి ఏడు ఎనిమిది నెలలు షూటింగ్ అంటే అందులో 90 నుంచి 120 రోజుల దాకా షూటింగ్ జరుగుతుంది. మరి ఈ నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేయడం శివ నిర్వాణ కి ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.

Web TitleVijay Devarakonda and Samantha Giving 4 Months to Shiva Nirvana to Complete Movie
Next Story