మాస్ ఎంటర్టైనర్ లో కనిపించనున్న విక్టరీ వెంకటేష్

Victory Venkatesh Movie With Direction Sampath Nandi
x

మాస్ ఎంటర్టైనర్ లో కనిపించనున్న విక్టరీ వెంకటేష్

Highlights

*మాస్ ఎంటర్టైనర్ లో కనిపించనున్న విక్టరీ వెంకటేష్

Venkatesh: సీనియర్ హీరో వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వెంకి మామ సినిమాతో డిజాస్టర్ అందుకున్నప్పటికీ "నారప్ప" మరియు "దృశ్యం 2" సినిమాలతో వెంకటేష్ మంచి విజయాలను సాధించారు. ఇక ప్రస్తుతం "ఎఫ్ 3" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు వెంకటేష్. వరుణ్ తేజ్ కూడా హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఒక కామెడీ ఎంటర్ టైనర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెహరీన్ మరియు తమన్నా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత వెంకటేష్ మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టును సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయ.

తాజా సమాచారం ప్రకారం విక్టరీ వెంకటేష్ ఇప్పుడు సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మాస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ అనుదీప్ కె.వి డైరెక్షన్ లో ఒక కామెడీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తరువాత సంపత్ నంది దర్శకత్వంలో వెంకటేష్ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. అయితే మరో వైపు వెంకీ రానా తో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు తెలుస్తోంది. "రానా నాయుడు" అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories