మూడు రోజుల పెళ్లి చేసుకోబోతున్న బాలీవుడ్ స్టార్ జంట

Vicky Kaushal and Katrina Kaif is Getting Married On 08 11 2021
x

మూడు రోజుల పెళ్లి చేసుకోబోతున్న బాలీవుడ్ స్టార్ జంట(ఫైల్ ఫోటో)

Highlights

* డిసెంబర్ 7 8 9 తారీకులలో ఈ జంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నారు

Katrina Kaif - Vicky Kaushal Marriage: ఇప్పటికే బాలీవుడ్లో పలు స్టార్ జంటలు పెళ్లికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ ల జోడి. దాదాపు బాలీవుడ్ లో ఉన్న అందరు స్టార్ హీరోలతో నటించి ప్రస్తుతం భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరైన కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ జంట వారి పెళ్లి కి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు. తెలుగులో కూడా వెంకటేష్ సరసన "మల్లీశ్వరి" సినిమాలో కనిపించిన కత్రినాకైఫ్ ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లికి సిద్ధం అవుతోంది. వీరిద్దరి పెళ్లి మూడు రోజుల పాటు జరగబోతోందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

డిసెంబర్ 7 8 9 తారీకులలో ఈ జంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల బోగట్టా. నిజానికి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అనే విషయాన్ని జీర్ణించుకోవడానికి అభిమానులకి చాలా కాలం పట్టింది. ఇక ఇరు కుటుంబాలు కూడా పెళ్లికి ఓకే అనడంతో ఈ జంట అతి తొందరలో పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమయ్యారు.

రాజస్థాన్ లోని ఏడు వందల ఏళ్ల క్రితం నాటి పోర్టులో వీరిద్దరి పెళ్లి జరగబోతుంది. అట మరోవైపు దీపావళి సందర్భంగా విక్కీ కౌశల్ తల్లి వీణ కౌశల్ కాబోయే కత్రినాకైఫ్ కోసం చీరలు మరియు నగలు పంపినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories