మా సినిమాలో అల్లరి నరేష్ నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

మా సినిమాలో అల్లరి నరేష్ నటించడం లేదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
x
Allari Naresh ( File Photo)
Highlights

హీరో నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాని చేసిన తర్వాత దర్శకుడు వీఐ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా.. రవితేజ కథానాయకుడిగా...

హీరో నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాని చేసిన తర్వాత దర్శకుడు వీఐ ఆనంద్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా.. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్నాడు. నభానటేశ్‌, పాయల్‌రాజ్‌పుత్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్. మోషన్ పోస్టర్స్ సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. అయితే ఈ సినిమాలో హీరో అల్లరి నరేష్ నటించాబోతున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. సెకండ్‌ హాఫ్‌లో అయన పాత్ర కీలకంగా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై డైరెక్టర్‌ వీఐ ఆనంద్‌ క్లారిటీ ఇచ్చాడు. డిస్కోరాజాలో అల్లరి నరేశ్‌ నటించడం లేదని, అవన్నీ అవాస్తవమని అన్నాడు.

ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు . వెన్నెల కిశోర్‌, సత్య, అజయ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాబీ సింహా విలన్‌ గా నటిస్తున్నాడు . సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక అల్లరి నరేష్ విషయానికి వస్తే ఈ సంవత్సరం మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన మహర్షి సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించాడు అల్లరి నరేష్.. ఈ పాత్రకి గాను నరేష్ కి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం సోలోగా ఓ సినిమా ద్వారా ఓ నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. శతమానం భవతి ఫేం సతీష్ విగ్నేశ ఈ సినిమాకి నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories