రాజకీయ నేపథ్యంతో సాగే సినిమా ప్లాన్ చేస్తున్న "విరాటపర్వం" డైరెక్టర్

Venu Udugula Says he Will Make a Political Action Thriller Movie
x

రాజకీయ నేపథ్యంతో సాగే సినిమా ప్లాన్ చేస్తున్న "విరాటపర్వం" డైరెక్టర్

Highlights

రాజకీయ నేపథ్యంతో సాగే సినిమా ప్లాన్ చేస్తున్న "విరాటపర్వం" డైరెక్టర్

Udugula Venu: "నీది నాది ఒకే కథ" సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వేణు ఉడుగుల ఈ మధ్యనే రానా మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన "విరాటపర్వం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక అద్భుతమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలను మాత్రం దక్కించుకుంది. నిజాయితీ గల కథని వేణు ఉడుగుల చాలా బాగా తెరకెక్కించారు అంటూ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఇప్పుడు వేణు ఉడుగుల రాజకీయ నేపథ్యంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ ను తీయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయాన్ని వేణు ఉడుగుల స్వయంగా వెల్లడించారు. "ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కథ సిద్ధమవుతోంది. హీరోతో పాటు మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తాను" అని స్పష్టం చేశారు వేణు ఉడుగుల. హీరో ప్రధానంగా సాగే కథ అని కమర్షియల్ విలువలతో ఉంటుందని చెప్పిన వేణు ఉడుగుల కథకి నిజజీవిత సంఘటనలకి ప్రభావం ఉండదని ఇది కేవలం ఒక కల్పితమైన కథ అని అన్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం "విరాటపర్వం" సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్ గా మారింది. మరి ఈ విషయాన్ని తెలుసుకొని వేణు ఉడుగుల తన తదుపరి సినిమాతో హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories