logo
సినిమా

లవంగం గా మారనున్న వెన్నెల కిషోర్

లవంగం గా మారనున్న వెన్నెల కిషోర్
X
Highlights

నాగార్జున కెరీర్ లొనే ఎంటర్టైనింగ్ సినిమాలలో 'మన్మధుడు' సినిమా కూడా ఒకటి. ఆ సినిమాలో ఆడవాళ్లకు ఆమడ దూరంలో ఉండే ...

నాగార్జున కెరీర్ లొనే ఎంటర్టైనింగ్ సినిమాలలో 'మన్మధుడు' సినిమా కూడా ఒకటి. ఆ సినిమాలో ఆడవాళ్లకు ఆమడ దూరంలో ఉండే నాగార్జున పాత్ర పక్కన పెడితే ఆ తరువాత బాగా ఎంటర్టైన్ చేసిన పాత్ర బ్రహ్మానందం ది అని చెప్పుకోవచ్చు. పారిస్ లో సెటిల్ అయిన లవంగం అనే పాత్ర పోషించిన బ్రహ్మానందం తెరపై కనిపించేది కేవలం 20 నిమిషాలు మాత్రమే. కానీ బ్రహ్మీ తెరపై ఉన్నంతసేపు ప్రేక్షకులు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుతూనే ఉంటారు. ఇప్పుడు నాగార్జున 'మన్మధుడు' సినిమాకు సీక్వెల్ గా 'మన్మధుడు 2' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కానీ గత కొంత కాలంగా బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉంటున్నారు కానీ ఈ సినిమాలో మాత్రం లవంగం పాత్ర ఉండబోతుందట. కానీ బ్రహ్మానందం బదులు ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ఈ పాత్ర పోషిస్తున్నదని తెలుస్తుంది. అయితే వెన్నెల కిషోర్, లవంగం మరియు ఆల్డా దంపతుల కుమారుడి గా కనిపిస్తాడని ప్రేక్షకులతో నవ్వుల పువ్వులు పూయుస్తాడని తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన 'చిలసౌ' సినిమాలో కూడా వెన్నెల కిషోర్ పాత్ర బాగా పండింది. ఈ సినిమాలో కూడా అదే జరగబోతుంది అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Next Story