వెంకీమామ ట్రైలర్ : మామ అల్లుళ్ళు అదరగొట్టారు

వెంకీమామ ట్రైలర్ : మామ అల్లుళ్ళు అదరగొట్టారు
x
venkymama
Highlights

టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్ గా తెరకక్కుతున్న చిత్రం వెంకీమామ.. నిజ జీవితంలో మామ అల్లుళ్ళు అయిన వెంకటేష్ , నాగ చైతన్య ఇప్పుడు రీల్ లైఫ్ లో కూడా...

టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్ గా తెరకక్కుతున్న చిత్రం వెంకీమామ.. నిజ జీవితంలో మామ అల్లుళ్ళు అయిన వెంకటేష్ , నాగ చైతన్య ఇప్పుడు రీల్ లైఫ్ లో కూడా అదే పాత్రలో కనిపిస్తూ ఉండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా అతృతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదలైంది. క్లాస్ ప్లస్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పక్కగా ట్రైలర్ ని కట్ చేశారు.

స్క్రీన్ పైన మామా అల్లుళ్లుగా అదరగొట్టారు వెంకీ, చైతూ. కుటుంబ నేపధ్యంతో పాటు మాస్ అంశాలను కూడా బాగానే తెరకెక్కించాడు బాబీ.. ముఖ్యంగా ట్రైలర్ లోని డైలాగ్స్ బాగా పేలుతున్నాయి. మనిషి తలరాతను రాసే శక్తి దేవుడికి ఉందని నీ నమ్మకం.. ఆ రాతను తిరిగిరాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం.. నీ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు మామయ్యా.. అది నీ వల్ల కూడా కాదు.. ఈ సారి జాతరను రంగులతో కాదు.. మీ రక్తంలో ఎరుపెక్కిస్తాను.. రండ్రా నా కొడకల్లారా.. వాళ్లు రోజూ దాటే గీత మనం ఒక్కసారి దాటితే ఎలా ఉంటుందో చూపించి వస్తాను సర్.. అంటూ పవర్ ఫుల్ డైలాగులతో టిజర్ ని కట్ చేశారు.

ఈ సినిమాలో రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని ఏంటో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 13న విడుదల కానుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories